Saturday, 27 November 2021

Love Anthem : రాధే శ్యామ్ సెకండ్ సాంగ్‌ టీజ‌ర్ ఎప్పుడంటే.. ప్రభాస్ ఎక్స్‌పెరిమెంట్

‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ ఇప్పుడు ‘రాధే శ్యామ్‌’ అనే ప్రేమ క‌థా చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఎపిక్ ల‌వ్‌స్టోరిగా రూపొందుతోన్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాతలు ప్ర‌క‌టించారు. హీరోయిన్‌. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ వ‌స్తుందా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న త‌రుణంలో రాధే శ్యామ్‌లో రెండో సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత‌లు. రెండో పాట‌గా ల‌వ్ సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. వ‌న్ హార్ట్.. టు హార్ట్ బీట్స్ అనే సాంగ్ టీజ‌ర్‌ను సోమ‌వారం విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాణ సంస్థ యు.వి.క్రియేష‌న్స్ తెలియ‌జేసింది. హిందీలో రేపు మ‌ధ్యాహ్నం 1 గంట‌కు.., తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో సాంగ్ టీజ‌ర్‌ను సాయంత్రం 7 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు. ఒక సినిమా రెండు మ్యూజిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌బోతున్న‌ట్లు.. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఇలా చేయ‌డం ఇదే తొలిసారి అని మేక‌ర్స్ అనౌన్స్‌మెంట్ చేయ‌డం విశేషం. పూర్తి లిరిక‌ల్ వీడియో సాంగ్ న‌వంబ‌ర్ 30న విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మేక‌ర్స్ ఇచ్చిన అప్‌డేట్స్‌పై ఫ్యాన్స్ సంతోష‌ప‌డుతున్నారు. ఓ సినిమా పాటను రెండు వెర్ష‌న్స్‌లో ఇవ్వ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకునే విష‌య‌మే. యూర‌ప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరి ఇది. విక్ర‌మాదిత్య‌గా ప్ర‌భాస్‌, ప్రేర‌ణ‌గా పూజా హెగ్డే ఎలా మెస్మ‌రైజ్ చేస్తారోన‌ని ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ గ్లింప్స్, ఓ వీడియో ప్రోమో, ఓసాంగ్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు యు.వి.క్రియేష‌న్స్ రిలీజ్ చేసింది. ‘జిల్‌’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మూడు వంద‌ల కోట్ల‌పైగా భారీ బ‌డ్జెట్‌ను ఖ‌ర్చు పెట్టి సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌భాస్ ఈ సినిమాలో భ‌విష్య‌త్తును ఊహించే వ్య‌క్తిగా క‌నిపిస్తారు. తన ప్రేయ‌సి ఎలాంటి ప్ర‌మాదాన్ని ఎదుర్కొన‌బోతుంద‌నే విష‌యాన్ని ముందుగానే గుర్తు ప‌ట్టిన ఆయ‌న ఆమెను ఎలా కాపాడుకున్నాడ‌నేదే క‌థ అని కూడా నెట్టింట వార్త‌లు వినిపిస్తున్నాయి. రాధేశ్యామ్ చిత్రీక‌ర‌ణను ఎప్పుడో పూర్తి చేసిన ప్ర‌భాస్‌.. ఇప్ప‌టికే ఆది ప‌రుష్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. స‌లార్ షూటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఆ వెంట‌నే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే ‘ప్రాజెక్ట్ కె’.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శ‌క‌త్వంలో త‌న మైల్‌స్టోన్ మూవీ...25వ చిత్రం ‘స్పిరిట్‌’ చిత్రాల‌ను సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నారు ప్ర‌భాస్‌.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lh4bYF

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk