Saturday, 27 November 2021

Bala Krishna : బాల‌కృష్ణ‌ భ‌క్తి ప్రోగ్రామ్‌.. అన్‌స్టాప‌బుల్ త‌ర్వాత నంద‌మూరి హీరో డేరింగ్ స్టెప్

జ‌యాప‌జ‌యాలు దైవాధీనాలు అనే సిద్ధాంతాన్ని బాగా న‌మ్మే హీరోల్లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. అందుకే ఆయ‌న ఎప్పుడూ కొత్త‌ద‌నం కోసం ప్ర‌యత్నిస్తుంటారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లోనూ తెలియ‌జేశారు. అదే ఆయ‌న ధైర్యం అని కూడా అనొచ్చు. ఎందుకంటే సినిమాల‌తో బిజీగా ఉండే ఆయ‌న రీసెంట్‌గా అన్‌స్టాప‌బుల్ అంటూ డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఈ ప్రోగ్రామ్ ఎంత స‌క్సెస్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హోస్ట్‌గా చేస్తున్న బాల‌య్య ఆటిట్యూడ్‌ను చూసిన‌వారు స‌రికొత్త బాల‌కృష్ణ‌ను చూస్తున్నామ‌ని అంటున్నారు. ఇప్పుడు బాల‌కృష్ణ మ‌రో డేరింగ్ స్టెప్ వేస్తున్నారు. ఇంత‌కీ ఏ స్టెప్ అనుకుంటున్నారా? ఇప్ప‌టికే అన్‌స్టాప‌బుల్ అంటూ ఆహాలో సంద‌డి చేస్తున్న బాల‌కృష్ణ మ‌రో కొత్త ప్రోగ్రామ్ చేయ‌డానికి తెర తీశారు. త్వ‌ర‌లోనే ఆయ‌న ఓ భ‌క్తి ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలియజేశారు. శ‌నివారం హైద‌రాబాద్‌లో అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుక‌లో బాల‌య్య మాట్లాడుతూ త్వ‌ర‌లోనే భ‌క్తి ప్రోగ్రామ్‌ను చేయ‌బోతున్నాం. ఆ వివ‌రాల‌ను కూడా త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని అన్నారు. సాధార‌ణంగా బాల‌య్య‌కు భ‌క్తి ఎక్కువ‌. పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌కుండా ఆయ‌నేప‌ని చేయ‌రు. సంస్కృతంపై ఆయ‌న‌కు మంచి అవ‌గాహ‌న ఉంది. అందులో శ్లోకాలు చ‌దువుతుంటారు. ఆయ‌న ప్రెస్‌మీట్స్‌లోనూ ఆయ‌న సంస్కృత శ్లోకాల‌ను మనం వినొచ్చు. అఖండ సినిమా అనేది అక్ష‌రం, భ‌క్తి గొప్ప‌తనాన్ని తెలియ‌జేసే చిత్ర‌మ‌ని చెబుతూ త్వ‌ర‌లోనే భ‌క్తి ప్రోగ్రామ్ చేస్తామ‌ని వెల్ల‌డించారు. అంటే బాల‌కృష్ణ త‌న అనుబంధాన్ని ఆహాతో మ‌రికొంత కాలం కొన‌సాగించ‌బోతున్నార‌న్న‌మాట‌. అయితే అదెప్పుడో.. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంద‌నే వివ‌రాలు తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక అఖండ సినిమా విష‌యానికి వ‌స్తే.. బాల‌కృష్ణ హీరోగా బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో చేసిన సినిమా అఖండ‌. డిసెంబ‌ర్ 2న విడుద‌ల‌వుతుంది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంచ‌నాల‌కు త‌గిన‌ట్లే.. బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్‌గా రూ.60 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జ‌రిగిందని స‌మాచారం. అలాగే డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా ఫ్యాన్సీ రేటుకే అమ్ముడయ్యాయి. ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో పూర్ణ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3paOgfT

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...