యంగ్ రెబల్ స్టార్ హీరోగా రూపొందుతున్న భారీ సినిమా . పాన్ ఇండియా మూవీగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్ బ్యూటిఫుల్ ఎంటర్ టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్.. ప్రమోషన్స్ వేగవంతం చేసి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కడుతోంది. కోవిడ్‌తో పాటు పలు కారణంలతో రాధే శ్యామ్ షూటింగ్ పలుమార్లు వాయిదా పడటంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ వస్తాయా? అని ఇన్నాళ్లు ఎదురుచూసిన రెబల్ స్టార్ అభిమానులు ఖుషీ అయ్యేలా ఇప్పుడు ఒక్కో అప్‌డేట్ వదులుతున్నారు మేకర్స్. ఇప్పటికే కొన్ని పోస్టర్స్, ప్రభాస్ క్యారెక్టర్‌కు సంబంధించిన టీజర్ ద్వారా అభిమానులకు పూనకాలు తెప్పించిన యూనిట్.. తాజాగా ప్రేమ బాణం విసురుతూ రాధే శ్యామ్ లవ్ ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేసింది. “రాధేశ్యామ్” లవ్ ఆంథెమ్ ప్రోమోతోనే ఈ సాంగ్‌పై ఆసక్తి పెరగగా.. తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేసి లవ్ బర్డ్స్ మనసు దోచుకున్నారు. ఈ పాటలో ప్రభాస్, చాలా అందంగా కనిపించడమే గాక వాళ్ళిద్దరి రొమాంటిక్ మూమెంట్స్ యమ కిక్కిచ్చాయి. ఇక ఈ వీడియోను అటు ప్రభాస్, ఇటు పూజా హెగ్డే తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ రాధా కృష్ణ. యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3D56owB
No comments:
Post a Comment