సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2న విడుదలవుతుంది. శనివారం జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘నందమూరి ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. బాలకృష్ణగారి తండ్రిగారు ఎన్టీఆర్‌గారు, మా తాతగారు అల్లు రామలింగయ్యగారి నుంచి కొనసాగుతోంది. ఈనాటి అనుబంధం ఏనాటిదో. మా తాతగారికి ఎన్టీఆర్‌గారితో ఎంత చనువుందంటే, నేరుగా ఆయన వంటింట్లోకి వెళ్లేపోయేవారు. ఎన్టీఆర్‌తోనే కాదు బాలకృష్ణగారితోనూ మా తాతగారు సినిమాలు చేశారు. మానాన్నగారు, బాలకృష్ణగారు ఒకే జనరేషన్ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తులు. నా విషయానికి వస్తే చిరంజీవిగారు, బాలకృష్ణగారి సినిమాలు చూస్తూ పెరిగిన జనరేషన్. అలాంటి నేను ఈరోజు బాలకృష్ణగారి ఫంక్షన్‌కు రావడం ఎంతో ఆనందాన్నిస్తుంది. చాలా తీయటి అనుభూతినిచ్చింది. బోయపాటి శ్రీనుగారంటే నాకెంతో ఇష్టం. భద్ర సినిమాను ముందు ఆయన నాకే చెప్పారు. ఆర్య సినిమా కారణంగా నేను ఆ సినిమా చేయలేకపోయాను. ఆ సినిమా ఎలాగైనా జరగాలనే ఉద్దేశంతో, బోయపాటిగారిపై నమ్మకంతో సపోర్ట్ చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ కావడం, అక్కడి నుంచి టాప్ డైరెక్టర్ కావడం వరకు బోయపాటిగారి జర్నీని చూశాను. ఆయన ఈ స్థాయిలో ఉండటాన్ని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. నన్ను చూసి కూడా బోయపాటిగారు అలాగే సంతోషిస్తారు. ఆయనతో కలిసి సరైనోడు సినిమా చేశాను. అది మరచిపోలేను. బాలకృష్ణగారు, బోయపాటిగారి కాంబినేషన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనాలు సింహాతో ఆదరించారు. లెజెండ్‌తో పెరిగింది. అఖండతో అన్‌స్టాపబుల్‌గా ఉందని అర్థమవుతుంది. నేను ట్రైలర్ చూసినప్పుడే బోయపాటిగారికి ఫోన్ చేసి మరీ అద్భుతంగా ఉందని చెప్పాను. పూనకాలే వచ్చేలా ఉందని అన్నాను. తమన్ సాలిడ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక టెక్నీషియన్‌కి థాంక్స్. నిర్మాత రవిగారికి అభినందనలు. నిర్మాత కొడుకుగా ఆయన కష్టమేంటో నాకు తెలుసు. శ్రీకాంత్‌గారు ఎంతో సున్నిత మనస్కుడు. ఆయనపై నా అభిప్రాయాన్ని ఈసినిమాతో బోయపాటిగారు మార్చేశారు. కొత్త శ్రీకాంత్‌ను చూస్తారు. బాలకృష్ణగారికి సినిమాపై ఉన్న అడిక్షన్, బాలకృష్ణగారికి సినిమాలో ఉన్న డిక్షన్ కారణంగానే ఆయన ఈస్థాయిలో ఉన్నారు. ఆయనలా మరొకరు డైలాగ్ చెప్పలేరు. ఆయన ఎంత పెద్ద డైలాగ్ చెప్పినా ఇన్‌టెన్షన్ తగ్గదు. అది ఒక బాలయ్యగారికి మాత్రమే కుదిరిన విషయం. ఆయన రీల్‌లో అయినా రియల్‌లో అయినా రియల్‌గానే ఉంటారు. ఇవాళ సమాజంలో మనం అనుకున్నది చేయగలటం, మనలాగా ఉండగలటం అనేది చాలా కష్టమైన పని. కానీ దాన్ని బాలయ్య చాలా ఈజీగా చేసేస్తుంటారు. నాకు ఆయనలో ఆ క్వాలిటీ బాగా నచ్చుతుంది. ఆయన చేసిన అఖండ మూవీ అఖండ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. రెండో కరోనా తర్వాత వస్తున్న పెద్ద సినిమా. అఖండ జ్యోతిలా తెలుగుసినిమాకు వెలుగునివ్వాలని కోరుకుంటున్నాను. ’’ అన్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రమిది. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్. పూర్ణ కీలక పాత్రలో నటించింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/316JRlZ
No comments:
Post a Comment