Sunday, 28 November 2021

జై బాలయ్య.. నందమూరి నటసింహానికి హాట్ బ్యూటీ కిస్.. ఫ్యాన్స్‌కి స్పెషల్ కిక్కిస్తున్న ఫాస్ట్ బీట్

నందమూరి మాస్ జాతర షురూ అయింది. హీరోగా దర్శకత్వంలో రూపొందుతున్న '' ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్ గత రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ ఈవెంట్‌లో పలువురు తారలు తళుక్కుమన్నారు. దర్శకనిర్మాతల స్పీచ్ సినిమాపై హైప్ పెంచేయగా.. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన '' సాంగ్ నందమూరి అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చింది. భారీ రేంజ్‌లో రూపుదిద్దుకున్న ‘అఖండ’ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మాస్‌ సాంగ్ జై బాలయ్య. బాలకృష్ణ- ఆడిపాడిన ఈ పాటలోని సీన్స్, రొమాంటిక్ మూమెంట్స్ బాలయ్య అభిమానులను హుషారెత్తించాయి. యా.. యా.. యా.. జై బాలయ్య అంటూ సాగిపోతున్న ఈ ఫాస్ట్ బీట్ అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది. తమన్ అందించిన బాణీల్లో బాలయ్య బుగ్గపై ప్రగ్యా పెట్టిన కిస్ సీన్ యమ కిక్కిచ్చింది. బాలయ్య వేసిన వెరైటీ స్టెప్స్, డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతూ సాంగ్ అదిరిందని కామెంట్లు చేస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో పూర్ణ కనిపించనుంది. ఇక బాలయ్య బాబు రైతుగా, అఘోరాగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో అదరగొట్టనున్నారు. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌కి తోడు అఘోరా ఎపిసోడ్ ఈ మూవీలో హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. గతంలో బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్స్ ''సింహ, లెజెంట్'' చెంతన 'అఖండ' మూవీ కూడా చేరుతుందని భావిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హాట్రిక్ మూవీ కావడంతో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 2న రిలీజ్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rf1ZVr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....