Saturday, 27 November 2021

AKHANDA Pre Release Event : బాలయ్య భుజానికి గాయం.. అసలు సంగతి చెప్పిన బోయపాటి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్ తరువాత ముచ్చటగా మూడో సారి హిట్ కొట్టేందుకు వస్తున్నారు. డిసెంబర్ 2న రాబోతోన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైద్రాబాద్‌లో ని శిల్పా కళా వేదికలో జరిగింది. ఈ ఈవెంట్‌కు రాజమౌళి, అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈవెంట్‌లో చిత్రయూనిట్ పాల్గొంది. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పిలవగానే ఈవెంట్‌కు వచ్చిన రాజమౌళి, అల్లు అర్జున్ గారికి థ్యాంక్స్. మీ అందరి ఉత్సాహం చూస్తున్నాను. క్షమాపణ చెబుతున్నా. అవుట్ డోర్‌లో చేద్దామని అనుకున్నాను. కానీ వెదర్ బాగా లేదని, వర్షం పడేలా ఉందని ఇలా చేశాం. ఈ సినిమాలో బాలయ్య గారు ఎంతో అందంగా ఉంటారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమా డిసెంబర్ 2న మీ అందరి ముందుకు రాబోతోంది. 2020 మార్చి ఎలా ఉంది.. థియేటర్లోనే సినిమా చూడాలనే ఆనవాయితి. దానికి బ్రేక్ పడింది. ఆ బ్రేక్‌ని మళ్లీ అఖండతో ప్రారంభిస్తున్నాం. అ లెగసినీ పుష్ప రాజ్ గానీ, ఆర్ఆర్ఆర్ గానీ ముందుకు తీసుకెళ్తాయి. పాత రోజులు మళ్లీ వస్తాయి. సౌత్‌లో కరోనా భయం లేదు. ఆర్ఆర్ఆర్‌తో నార్త్‌లో కరోనా భయాన్ని పోగొట్టేయాలి. కష్టపడేవాడిని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. అందుకే బన్నీకి సక్సెస్ వస్తుంది. సినిమా మొదలవుతుంది. జాతర మొదలవుతుంది. మళ్లీ సక్సెస్ మీట్‌లో కలుద్దాం’ అని అన్నారు.. మాట్లాడుతూ.. ‘జై బాలయ్య.. అనేది ఎప్పుడు నేను చెప్పుకుంటూనే ఉంటాను. టైమ్ అవుతుంది కాబట్టి తక్కువే మాట్లాడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్. బన్నీకి, రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు. మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. గుండెల మీద చేయి వేసుకుని చూసి బయటకు వచ్చేంతా.. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ‘దేవుడిని కరుణించమని అడుగు.. కనిపించమని అడుగు’ అది డైలాగ్. డ్యాన్స్ మాస్టర్స్ భాను, శంకర్‌లు పాటను కంపోజ్ చేశారు. తొలి రెండు ఫైట్స్.. రామ్ లక్ష్మణ్ చేశారు. తర్వాత స్టంట్ శివ, కెవిన్, స్టీవెన్ మాతో పాటు ట్రావెల్ అయ్యారు. థమన్ అద్బుతమైన సాంగ్స్ అందించారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్‌కు హాట్సాఫ్. 21 నెలలుగా మా వెనక ఉన్న మా సినిమా నిర్మాతకు థాంక్స్. బాలకృష్ణ చేయి ఇలా కావడానికి నేనే కారణం. సాంగ్ చేసిన తర్వాత.. స్ట్రెచింగ్ చేయాలి. అయితే జై బాలయ్య సాంగ్ తర్వాత ఇంటికెళ్లి ఆయన స్ట్రెచింగ్ చేస్తుండగా.. కాలు జారి పడిపోయాడు. భుజం మీదే బరువు పడింది. భుజం డిస్ లొకేట్ అయింది. కానీ అప్పటికే కోటిన్నరతో సెట్ వేశాను. రాత్రి ఈ విషయం నాకు తెలిసింది. నా గుండె జారిపోయింది. పొద్దున సెట్‌కు రాగానే సాంగ్ ఆపేద్దామని చెప్పాను. కానీ బాలయ్య గారు ఫ్యాన్స్ కోసం చేయాలి.. చేస్తాను అన్నాడు. బాబు ఆలోచించండి.. దిగిన తర్వాత నేను ఊరుకోను అన్నారు. కానీ బాలయ్య అందుకు ఒప్పుకున్నారు. నా అభిమానులకు మాస్ సాంగ్ లేకపోతే ఎలా చేసేద్దాని అన్నారు. చేయి లేవకున్నా.. లోపల కట్టి చేసిన సాంగ్ ఇది. షోల్డర్ పెయిన్‌తోనే ఆయన సాంగ్ చేశారు. నేను ఈ స్టేజ్ షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపిగా ఫీలవుతున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి హెల్ఫ్ చేసింది బన్నీ బాబు. ఆ తర్వాత కెరీర్ స్టార్ చేసి.. ఇంత ఎత్తు ఎదగడానికి కారణం బాలయ్య బాబు. ఇద్దరి ముందు ఇలా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 2న అఖండ రిలీజ్ అవుతుంది. బన్నీ ఈరోజు ఎంత ఎంకరేజ్ ఇస్తున్నాడో.. ఇదే ఎనర్జీతో పుష్ప డిసెంబర్ 17న రిలీజ్ కూడా ముందుకు నడిపించాలి. అందరూ కలిసి ఆర్ఆర్ఆర్‌ను ముందుకు నడిపించాలి. బీమ్లా నాయక్‌ను ముందుకు నడిపించాలి. అఖండతో నేను గెలవాలని అనుకోలేదు.. సినిమా గెలవాలని అనుకున్నాను. సుకుమార్ గెలవడం కాదు.. పుష్ప గెలవాలి. సినిమానే గెలుస్తూ ఉండాలి. ఈ సినిమాకు నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది.. డ్రైవర్స్ యూనియన్, ఫుడ్ పెట్టిన ప్రొడక్షన్ బాయ్స్, క్రొకైడల్ జోన్‌లో నాతో నడిచిన సెట్ అసిస్టెంట్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్, నా ఫైట్ మాస్టర్, నా లైట్ ఆఫీసర్స్. నా కెమెరా అసిస్టెంట్స్. కర్ణాటక ఫారెస్ట్, పోలీస్.. డిపార్ట్‌మెంట్స్ చాలా థాంక్స్. నందమూరి అభిమానులందరికీ థ్యాంక్స్. చాలా రోజుల తరువాత ఓపెన్ అవుతున్న ఈ సినిమా కొంత మందికి లోపలకి ఎంట్రీ ఇవ్వలేకపోయాం.. గుండెల్లో పెట్టుకోవాలి.. కానీ స్టేడియంలో ప్లేస్ చేయలేదు.. క్షమించాలి.. వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్త.. మీకు చీమ కుడితే.. మాకు పాము కుట్టినట్టు అనిపిస్తుంది. జాగ్రత్తగా వెళ్లండి.. మీ బోయపాటి శ్రీను’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3E0ZU35

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk