Sunday, 28 November 2021

ముద్దుతో కాంట్రవర్సీలో పవన్ కళ్యాణ్ హీరోయిన్.. క్రిమిన‌ల్‌తో లింకేంటని ప్ర‌శ్నిస్తున్న నెటిజ‌న్స్‌!

బాలీవుడ్ హీరోయిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు తెలుగులోకి కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో ఆమె రాకుమారి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ సినిమా కంటే ముందే ప్ర‌భాస్ హీరోగా రూపొందిన సాహో చిత్రంలో బ్యాడ్ బాయ్ సాంగ్‌లో స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇచ్చి అంద చందాల‌తో మెస్మ‌రైజ్ చేసింది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు వార్త‌ల్లో వ‌క్యిగా నిలిచింది. ఆమె ముద్దు ఫొటో ఒక‌టి లీకైంది. అది కాస్త వివాదానానికి దారి తీసింది. ముద్దు ఫొటో లీక్ కావ‌డంపై వివాద‌మేంటి? అనే అనుమానం రావ‌చ్చు. అస‌లు విష‌యం ఏంటంటే.. ఈ ఫొటోలో జాక్వ‌లైన్‌ను ముద్దు పెడుతున్న వ్య‌క్తి న‌టుడో, ఇంకెవ‌రో కాదు.. ప‌లు ఆర్థిక నేరాలు చేసిన క్రిమినల్‌కేసుల‌ను ఎదుర్కొంటోన్న వ్య‌క్తి సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్‌. సుఖేష్‌పై చాలా కేసులున్నాయి. త‌ను ప‌లువురిని మోసం చేసిన కేసులో అరెస్టై తీహార్ జైలులో శిక్ష‌ను కూడా అనుభ‌వించాడు. అలాంటి వ్య‌క్తితో జాక్వలైన్ ముద్దు మురిపాలేంటి? అని నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు. అది కూడా మ‌రెవ‌రో తీసింది కాదండోయ్‌..వారిద్ద‌రూ క‌లిసి తీసుకున్న సెల్ఫీ అని స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఈ సెల్ఫీ బ‌య‌ట‌కు రావ‌డంతో బాలీవుడ్ మీడియాలో సెన్సేష‌న్ అయ్యింది. 2021 ఏప్రిల్, మే నెల‌ల్లో ఈ ఫొటోను తీశార‌ని కూడా అంటుంది అక్క‌డి మీడియా. కొన్ని రోజుల ముందు మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి జాక్వలైన్‌ను స‌మ‌న్లు అందాయి. ఇంత‌కీ ఆ మ‌నీ లాండ‌రింగ్ కేసు వెనుకున్న ప్ర‌ధాన సూత్ర‌ధారి సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. దాంతో జాక్వలైన్‌కు, సుఖేష్‌కు ఏదో రిలేష‌న్ ఉంద‌ని భావించిన ఈడీ ఆమెకు స‌మ‌న్లు పంపింది. అదే స‌మ‌యంలో సుఖేష్‌తో జాక్వలైన్‌కు రొమాంటిక్ రిలేష‌న్ ఉంద‌ని అత‌ని త‌ర‌పు లాయ‌ర్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దాంతో జాక్వలైన్ ఆ వ్యాఖ్య‌ల‌ను కొట్టి పారేస్తూ వివ‌ర‌ణ ఇచ్చుకుంది కూడా. సుఖేష్ బాలాజీ అనే పేరుతో చాలా మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని మోసం చేశాడు. ఆ కేసులోనే అత‌ను తీహార్‌లో కొన్ని రోజులు శిక్ష‌ను అనుభ‌వించి బెయిల్‌పై బయ‌ట‌కొచ్చాడు. అలాంటి వ్య‌క్తితో సంబంధాలున్న‌ట్లు జాక్వ‌లైన్ రొమాంటిక్ సెల్ఫీ బ‌య‌ట‌కు రావ‌డంతో మ‌ళ్లీ ఆమె వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచింది. మ‌రి దీనిపై ఆమె ఎలాంటి వివ‌ర‌ణ ఇచ్చుకుంటుందో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cTzGTZ

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk