ప్రస్తుతం ఏపీలో సినిమాల పరిస్థితి ఏంటన్నది అందరికీ తెలిసిందే. థియేటర్లలో టిక్కెట్లు మరీ దారుణంగా తగ్గించేశారు. ఈ విషయంలో ఇండస్ట్రీలోని పెద్దలందరూ కూడా మరోసారి ప్రభుత్వంలో చర్చలు జరపాలని చూస్తున్నారట. కానీ అందులో ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. టికెట్ల రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రభుత్వం చెప్పిన రేటుకే చచ్చినట్టుగా రూ. 20, రూ. 30 ఇలాంటి రేట్లకు అమ్ముకోవాల్సిందే. అయితే దీనిపై తాజాగా సురేష్ బాబు సంచల కామెంట్స్ చేశాడు. విజయవంతంగా ఓటీటీలో దూసుకుపోతుండటంతో సురేష్ బాబు మీడియాతో ముచ్చటించాడు. ఈ క్రమంలో ప్రభుత్వాల చర్యల మీద కామెంట్ చేశాడు. ఓ ప్రొడక్ట్‌ను తయారు చేసుకున్న వాడికి దానికి ఓ రేటును ఫిక్స్ చేసుకునే హక్కు ఉంటుందని అన్నాడు. ఇలా మరీ దారుణంగా ఇరవై, ముప్పై రూపాయాలంటే థియేటర్లను ఎలా నడపాలని ఆవేదన వ్యక్తం చేశాడు. వాటితో కరెంట్ బిల్లు కూడా కట్టలేమని అన్నాడు. కరోనా వల్ల దెబ్బ థియేటర్ల వ్యవస్థను ఆదుకునేందుకు విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామని అన్నారు. కానీ ఇంత వరకు చేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నో సార్లు చర్చలు జరిపాం. సినిమా ఇండస్ట్రీ అంటే అందరికీ గౌరవం ఉంది. అందరూ బాగానే మాట్లాడతారు. మర్యాద ఇస్తారు. కానీ పనుల్లోకి వచ్చేసరికి మాత్రం అది కనిపించడం లేదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమను పట్టించుకోవడం లేదు.. చేస్తామని చెబుతున్నారు. కానీ చేయడం లేదంటూ సురేష్ బాబు సంచలన కామెంట్స్ చేశాడు. మేం వాళ్లతో సరిగ్గా కమ్యూనికేట్ అవ్వడం లేదా? లేదంటే.. వారే మమ్మల్ని కావాలనే పక్కన పెడుతున్నారా? అన్నది కూడా తెలియడం లేదంటూ సురేష్ బాబు తన మనసులోని మాటలను బయటపెట్టేశాడు. సినిమా పరిశ్రమ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, ట్యాక్సుల రూపంలో ఎంత వస్తుందని ఎప్పుడూ చూడొద్దని, సినిమా పరిశ్రమ అభివృద్ది చెందితే తద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలుంటాయని అన్నాడు. అందుకే కదా ఇప్పుడ యూపీ కూడా ఇండస్ట్రీ కోసం పాటు పడుతోంది.. మధ్య ప్రదేశ్ ఎక్కడా లేని సబ్సిడీలను ఇస్తోందని సురేష్ బాబు ఉదాహరణలుగా చెప్పాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nUblE4
No comments:
Post a Comment