Saturday, 27 November 2021

Nandamuri BalaKrishnaతో కాంబినేషన్ అనగానే అయిపోయాన్రా అనుకున్నా : శ్రీకాంత్

నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘అఖండ‌’. డిసెంబ‌ర్ 2న మూవీ విడుద‌ల‌వుతుంది. ఇందులో వ‌ర‌ద‌రాజులు అనే ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో న‌టించారు. త‌న పాత్ర గురించి, సినిమా ఎక్స్‌పీరియెన్స్ గురించి శ్రీకాంత్ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ మాట్లాడుతూ ‘‘ఇక్క‌డ‌కొచ్చిన బాల‌య్య అభిమానుల ఎన‌ర్జీ చూస్తుంటే డిసెంబ‌ర్ 2న ద‌బిడి దిబిడే అనిపిస్తుంది. బ‌న్నీతో క‌లిసి బోయ‌పాటిగారి ద‌ర్శ‌క‌త్వంలో నేను స‌రైనోడు సినిమా చేశాను. అది బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. అలాగే బాల‌య్య‌బాబుగారితో నేను చేసిన రెండో సినిమా ఇది. శ్రీరామ రాజ్యంలో ల‌క్ష్మ‌ణుడిగా న‌టించాను. అఖండ‌లో రావ‌ణాసురుడిగా న‌టించాను. ఇది క‌లే అనుకుంటాను. నా ముఖం చూసి సాఫ్ట్‌గా, ఫ్యామిలీ హీరో లాంటి సినిమాలో, బాబాయి క్యారెక్ట‌ర్సో వ‌స్తుంటాయి. నాలో బోయ‌పాటిగారు ఏం చూశారో తెలియ‌దు. స‌రైనోడు అయిన త‌ర్వాత భ‌య్యా! నిన్ను విల‌న్‌ని చేస్తాను. మ‌ధ్య‌లో ఈ చిన్న చిన్న‌వి ఒప్పుకోవ‌ద్దు అని బోయ‌పాటిగారు అన్నారు. అంటార్లే.. ఎక్క‌డి చేస్తార్లే అని నేను అనుకున్నాను. అందులో బాల‌కృష్ణ‌గారి ప‌క్క‌న విల‌న్‌గా అంటే జోక్ కాదు. ఆయ‌న ఎన‌ర్జీ ముందు త‌ట్టుకోవ‌డం అంత ఈజీ కాదు. అఖండ సినిమాలో డైలాగ్స్ హై ఓల్టేజీలో ఉంటాయి. నా ఫ‌స్ట్ షాటే బాల‌య్య‌గారి కాంబినేష‌న్‌లో ప‌డింది. అయిపోయాన్నా బాబు.. అనుకున్నాను. నా గెట‌ప్ కోసం బోయ‌పాటిగారు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. ఆయ‌న‌కు ఈ సంద‌ర్భంగా థాంక్యూ చెప్పుకుంటున్నాను. నా లుక్ చూసి నేనే న‌మ్మలేదు.. నేనేనా.. కాదులే..వ‌ర‌ద‌రాజులులే అనుకున్నాను. బాల‌కృష్ణ‌గారితో ఆపోజిట్‌గా డైలాగ్స్ చెప్పేట‌ప్పుడు చిన్న టెన్ష‌న్ ఉండింది. అయితే శ్రీకాంత్ అనే విష‌యం మ‌ర‌చిపోయి.. వ‌ర‌ద‌రాజులు అనే విష‌యాన్ని గుర్తు పెట్టుకుని వెళ్లి బోయ‌పాటిగారు ఏం చెబితే అది.. ఎలా చెబితే అలా చేసుకుంటే వెళ్లిపోయాను. బాల‌కృష్ణ‌గారు ఎంత‌గానో కోప‌రేట్ చేశారు. డైలాగ్స్ చెప్పేట‌ప్పుడు బాల‌కృష్ణ‌గారు ఎంతో ఎంక‌రేజ్ చేశారు. బాల‌కృష్ణ‌గారి ఎన‌ర్జీ సెట్స్‌లో చూస్తే మార్నింగ్ ఎంత ఎన‌ర్జీతో ఉండేవారో సాయంత్రం వ‌ర‌కు అదే ఎన‌ర్జీతో ఉంటారు. ఈ ఎనర్జీని థియేట‌ర్స్‌లో చూడ‌బోతున్నాం. నేను కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డిగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు’’ అన్నారు. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేశారు. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్ర‌మిది. ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌. పూర్ణ కీల‌క పాత్ర‌లో న‌టించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/315xlCM

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk