Saturday, 27 November 2021

Akhanda Pre Release Event : అఖండ‌తో పాటు పుష్ప‌, RRR, ఆచార్య‌.. అన్నీ సినిమాలు హిట్ కావాలి: నంద‌మూరి బాల‌కృష్ణ‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం అఖండ‌. డిసెంబ‌ర్ 2న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. దీనికి ఐకాన్ స్టార్ , ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి త‌దిత‌రులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ ‘‘నేను ముందుగా నా తండ్రిని ప్రేమిస్తాను. ఎందుకంటే ఆయ‌న తండ్రే కాదు.. నాకు గురువు కూడా. అలాగే ఆ త‌ర్వాత నా అభిమానుల్ని ప్రేమిస్తాను. ఎందుకంటే వారు నా నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమను అందిస్తున్నారు. మేం ఇంత మంది అభిమానుల ఆద‌ర‌ణ‌ను, ప్రేమ‌ను పొందడం నా పూర్వ‌జ‌న్మ సుకృతం. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. నేను ఇది వ‌ర‌కే అల్లు రామ‌లింగ‌య్య‌గారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని నేను చెప్పేశాను. అల్లు రామ‌లింగ‌య్య‌గారి మ‌న‌వ‌డు, అర‌వింద్‌గారి అబ్బాయి... నా త‌మ్ముడు అల్లు అర్జున్ ఈ రోజు వేడుక‌కి రావ‌డం ఆనందంగా ఉంది. దేశ‌మే కాదు.. ప్ర‌పంచ‌మే గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిగారు ఈవెంట్‌కు రావ‌డం ఇంకా సంతోషాన్నిచ్చింది. వారికి ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసుకుంటున్నాను. ఇంత‌కు ముందు సింహా, లెజెండ్ సినిమాల‌ను నేను, బోయ‌పాటి క‌లిసి చేశాం. అయితే అఖండ సినిమా విష‌యానికి వ‌స్తే అక్ష‌రంలోని ప‌వ‌ర్ గురించి తెలియ‌జేసేది. భ‌క్తి గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేయ‌బోతున్నాం. ఎంద‌రో గొప్ప గొప్ప రుషీశ్వ‌రులు పుట్టిన దేశ‌మిది. వారి వ‌ల్ల భ‌క్తి అనేది మ‌న మ‌ట్టిలో ఇనికిపోయింది. అలాంటి భ‌క్తిని మా అఖండ సినిమాతో బ‌తికిస్తున్నందుకు ఆనందంగా ఉంది. శ్రీకాంత్‌కి హ్యాట్సాఫ్‌. న‌టుడిగా ఆయ‌న వ‌ర‌ద‌రాజుల పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు. ఇలా అంద‌రూ అద్భుతంగా స‌పోర్ట్ చేశారు. అఖండ సినిమాను స్టార్ట్ చేసి 21 నెల‌లు అవుతుంది. ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి సినిమా చేశాం. డిసెంబ‌ర్ 2న సినిమా విడుద‌ల‌వుతుంది. దీని త‌ర్వాత చాలా సినిమాలు రాబోతున్నాయి. త్వ‌ర‌లోనే అల్లు అర్జున్ న‌టించిన పుష్ప విడుద‌ల‌వుతుంది. త‌మ్ముడు రామ్‌చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన RRR విడుద‌ల‌వుతుంది. అలాగే చిరంజీవిగారు న‌టించిన ఆచార్య విడుద‌ల‌వుతుంది. ఇంకా చాలా సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అంటూ అన్నీ సినిమాలు ఆడాలి. అందు రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌హాయ స‌హ‌కారాల‌ను అందించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త‌మ‌న్ అద్భుత‌మైన పాట‌ల‌తో పాటు, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. అలాగే రామ్ ల‌క్ష్మ‌ణ్ ఫైట్స్‌, శివ మాస్ట‌ర్‌, భాను మాస్ట‌ర్ ఇలా అంద‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. దీని తర్వాత గోపీచంద్ మలినేని చేస్తున్నాను. త్వరలోనే అనీల్ రావిపూడి సినిమా చేయబోతున్నాను. ఏ సినిమా చేసినా అభిమానులను దృష్టిలో పెట్టుకునే కష్టపడతాను’’ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lewrLG

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...