Thursday, 25 November 2021

Dhee 13 Grand Finale : బుల్లితెరపై అల్లు అర్జున్ సందడి... ప్రోమో వచ్చేసింది

ఐకాన్ స్టార్ సినిమాల్లోనే కాకుండా సీనియ‌ర్ హీరోల‌ను ఫాలో అవుతూ బుల్లితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నారా? అనే సందేహం వ‌స్తుంది. అయితే అందులో నిజం లేదు. అస‌లు విష‌య‌మేమంటే.. బుల్లితెర‌పై బ‌న్నీ సంద‌డి నిజ‌మే. అయితే హోస్ట్‌గా కాదండోయ్‌.. గెస్ట్‌గా మాత్ర‌మే. ఇంత‌కీ ఏ షోకు అల్లు అర్జున్ గెస్ట్‌గా వెళ్లారో తెలుసా? డాన్స్ షోకు. ఈటీవీలో మ‌ల్లెమాల వాళ్లు నిర్వ‌హిస్తున్న ఈ డాన్స్ షోకు చాలా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్ప‌టికే 12 సీజ‌న్స్ పూర్తి చేసుకుని 13వ సినిమా సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. డీ 13 షో ఫైన‌ల్స్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుద‌లైంది. పుష్ప ది రైజ్ చిత్రంలో ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా..’ అనే సాంగ్‌కు డానర్స్ స్టెప్స్ వేస్తుండ‌గా బ‌న్నీ ఎంట్రీ ఇచ్చారు. వారితో పాటు ఆయ‌న కూడా స్టెప్పులేయ‌డం విశేషం. త్వ‌ర‌లోనే ఢీ 13 ఫైన‌ల్ ఎపిసోడ్స్ ప్ర‌సారం కానుంది. శేఖ‌ర్ మాస్ట‌ర్‌, ప్రియ‌మ‌ణి, పూర్ణ ఈ షోకు న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఢీ 13లో కింగ్స్ వ‌ర్సెస్ క్వీన్స్ మ‌ధ్య పోటీలో ఎవ‌రు విజేత‌లో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప చేస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో తొలి భాగం పుష్ప ది రైజ్.. డిసెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఇంకా మంగ‌ళం శ్రీనుగా సునీల్‌, దాక్షాయ‌ణిగా అన‌సూయ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పాట‌లు, ఇంట్ర‌డ్యూస్ ఆఫ్ పుష్ప టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పుష్ప ది రైజ్ కోసం అల్లు అర్జున్ ఆర్మీ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. భారీ అంచనాలున్నాయి. శేషాచ‌ల అడ‌వుల్లో జరిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఇందులో బ‌న్నీ పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని స‌రికొత్త ర‌గ్డ్ లుక్‌, హెయిర్ స్టైల్‌తో బ‌న్నీ ప్రేక్ష‌కాభిమానుల‌ను మెప్పించ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్ర‌మిది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nT613V

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....