Friday, 26 November 2021

Project K : ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించాల‌నుకుంటున్నారా? అయితే అవ‌కాశాన్ని అందుకోండిలా!

మ‌న‌మెంతో ఇష్ట‌ప‌డే స్టార్స్‌ను ద‌గ్గ‌ర నుంచి చూస్తే చాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి అభిమాన తార‌ల‌తో క‌లిసి న‌టించే అవకాశం వ‌స్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎగిరి గంతేస్తారు క‌దా!. ఇప్పుడు ఛాన్స్ వచ్చేసింది. అలాంటి ఇలాంటి స్టార్ కాదు. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో క‌లిసి సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. అది కూడా పాన్ వ‌ర‌ల్డ్‌మూవీగా రూపొందుతోన్న ‘’ మూవీలో. టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ ఇప్పుడు హీరోగా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొన్నాళ్లు ముందు ఈ సినిమాను స్టార్ట్ చేశారు. కూడా బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో.. మ‌రో బాలీవుడ్ స్టార్‌ దీపికా ప‌దుకొనె ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ‘Project K’లో నటించడానికి 50-70 ఏళ్లున్న స్త్రీ, పురుషులు కావాల‌ని వైజ‌యంతీ మూవీస్ క్యాస్టింగ్ కాల్ ఆఫ‌ర్‌ను త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ ఆడిష‌న్‌ను డైరెక్ట్‌గా అటెండ్ కావ‌చ్చు.. లేదా ఆస‌క్తి ఉన్న వారు త‌మ బ‌యోడేటాను వీడియోస్‌తో క‌లిపి vymtalent@gmail.com అనే మెయిల్‌కు పోస్ట్ చేయ‌వ‌చ్చు. అయితే దీనికి ఉన్న ప్ర‌ధాన‌మైన కండీష‌న్ ఏంటో తెలుసా? స‌ద‌రు వ్య‌క్తులు హైద‌రాబాద్‌కు చెందిన వారై ఉండాలి. డిసెంబ‌ర్ నుంచి సినిమా షూటింగ్ షురూ కానుందని స‌మాచారం. ర‌జినీకాంత్ కాలా, క‌బాలి స‌హా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన‌ సంతోష్ నారాయ‌ణ్ క్రేజీ ప్రాజెక్ట్ Project Kకు సంతోష్ నారాయ‌ణ్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేయ‌బోతున్నార‌ట‌. పాన్ ఇండియా రేంజ్‌లో కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత సి.అశ్వినీ ద‌త్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్ష‌నల్ మూవీగా Project K రూపొంద‌నుంది. ఇక ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న లేటెస్ట్ పీరియాడిక్ మూవీ రాధేశ్యామ్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జ‌న‌వ‌ని 14న విడుద‌ల‌వుతుంది. దీనికి రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌య్యింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న స‌లార్ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. నాగ్ అశ్విన్ సినిమా పూర్తి కాక మున‌నుపే ప్ర‌భాస్ త‌న 25వ చిత్రం స్పిరిట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నాడు. అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్ వంటి చిత్రాల‌తో సెన్సేష‌న‌ల్ హిట్స్ అందుకున్న ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌నున్నారు.


    from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nYDppX

    No comments:

    Post a Comment

    'I Focused On Studying Charles Sobhraj'

    'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk