Friday, 26 November 2021

Exclusive... ‘భీమ్లా నాయక్’కి ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా?

సినిమా టైటిల్స్ విష‌యంలో ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు చాలా గ‌మ్మ‌త్తుగా ఆలోచ‌న‌లు చేస్తుంటారు. కొంద‌రు సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఓ అక్ష‌రాన్ని బేస్ చేసుకుని టైటిల్ పెట్టాల‌నుకుంటే, మ‌రికొంద‌రు పాట‌ల్లోని కొన్ని ప‌దాల‌తో టైటిల్స్ పెడుతుంటారు. ఇంకొంద‌రైతే మాస్ మ‌సాలా టైటిల్ పెడుతుంటారు. ఇలా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి మేక‌ర్స్ చేసే ప్ర‌య‌త్నాలు ఎన్నో. ఈ క్ర‌మంలో చాలా సినిమాల‌కు ముందు ఒక టైటిల్ అనుకుంటారు. త‌ర్వాత ఆ టైటిల్‌ను మార్చేస్తుంటారు. ఇది సాధార‌ణంగా జ‌రిగే విష‌య‌మే. అలాంటిదే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘భీమ్లా నాయ‌క్’ సినిమా టైటిల్ విష‌యంలోనూ జ‌రిగింద‌ట‌. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’కు ఇది రీమేక్‌. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు. స్క్రీన్ ప్లే, మాట‌లను ప్ర‌ముఖ రైట‌ర్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఇందులో రానా ద‌గ్గుబాటి కూడా మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ రెండు పాత్ర‌లు పోటాపోటీగా ఉంటాయి. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు. దానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఫ్యాన్స్ ‘’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘భీమ్లా నాయ‌క్‌’ మూల క‌థ మ‌ల‌యాళ సినిమాదే అయినా.. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు తెలుగు నెటివిటీ ప్ర‌కారం కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వ‌చ్చారు. సెట్స్‌లోకి వెళ్ల‌క ముందు ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ ముందుగా అనుకున్న టైటిల్ ‘అసుర సంధ్య వేళ‌లో..’. సాధార‌ణంగా త్రివిక్ర‌మ్ త‌న సినిమాల‌కు ‘అ’ అనే అక్ష‌రంతో టైటిల్స్ పెడుతుంటారు. అదే సెంటిమెంటుతో ‘అసుర సంధ్య‌వేళ‌లో..’ అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఉన్న మాస్ ఇమేజ్ దృష్ట్యా ఆ టైటిల్ ఆడియెన్స్‌కు అంత‌గా క‌నెక్ట్ కాదేమోన‌ని నిర్మాత‌లు భావించటంతో చివ‌ర‌కు టైటిల్‌ను ‘భీమ్లా నాయక్’గా ఖరారు చేశారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్, నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ జోడీగా నిత్యామీన‌న్‌, రానా ద‌గ్గుబాటి జోడీగా సంయుక్తా మీన‌న్ న‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి మూడు పాట‌లు, గ్లింప్స్‌, ప్రోమోలు విడుద‌లై మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి. దీని త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హ‌రిహ‌ర వీరమ‌ల్లు సినిమాను ప‌వ‌న్ పూర్తి చేయ‌డానికి రెడీ అవుతారు. ఇంకా హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FSfYok

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk