Friday, 26 November 2021

Perni Nani : అయ్యయ్యో.. పప్పులో కాలేసిన మంత్రి పేర్ని నాని.. త్రివిక్రమ్ ట్వీట్‌పై నిర్మాత క్లారిటీ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆన్‌లైన్ టికెటింగ్ వ్య‌వ‌స్థ‌లోనే ఇక‌పై సినిమా టికెట్స్ అమ్మాల్సి ఉంటుంద‌ని చెబుతూ, ప్ర‌భుత్వం నిర్దేశించిన రేట్స్‌లో ఆన్ లైన్ ప‌ద్ధ‌తిలో టికెట్స్‌ను విక్ర‌యించాల‌ని సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు తీసుకొచ్చింది. దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఏపీ ప్ర‌భుత్వ తీరుని సోష‌ల్ మీడియా ద్వారా త‌ప్పు ప‌ట్టారు. ఈ క్ర‌మంలో డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ట్విట్ట‌ర్ నుంచి ఓ ట్వీట్ వ‌చ్చింది. అదేంటంటే .. ‘చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒక‌టే టికెట్ రేటు అన్న‌ట్లు.. ప్ర‌తి స్కూల్‌లో ఒక‌టే ఫీజు, ప్ర‌తి హాస్పిట‌ల్‌లోనూ ఒక‌టే బిల్లు ఎందుకు పెట్ట‌రు? పేదవాడికి విద్య, వైద్యం కంటే సినిమా ఎక్కువా?’ అని ఇది బాగా వైర‌ల్ అయ్యింది. దీనిపై పేర్ని నాని కూడా మీడియా ముందు స్పందించారు. ఈ ట్వీట్‌ను తాను ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ‌తాన‌ని మినిష్ట‌ర్ అన్నారు. చిరంజీవితో పాటు ఎవ‌రు చెప్పిన అంశాలనైనా సీఎం దృష్టికి తీసుకెళ్ల‌డ‌మే నా ప‌ని. సినిమాటోగ్ర‌పీ శాఖ సీఎం దగ్గ‌రే ఉంది. ఆన్‌లైన్ టికెటింగ్ వ్య‌వ‌హారాన్ని సినీ పెద్ద‌ల‌తో మాట్లాడాల‌ని ఆయ‌న చెబితేనే నేను మాట్లాడా అని పేర్ని నాని అన్నారు. మంత్రి నాని చేసిన వ్యాఖ్య‌ల్లో ఇక్క‌డే అస‌లు చిక్కొచ్చి ప‌డ్డింది. ఎందుకంటే నిజానికి మంత్రి పేర్కొన్న ట్వీట్ పెట్టింది త్రివిక్ర‌మ్ కాదు. అస‌లు డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ట్విట్ట‌ర్‌లో లేనే లేరు. ఈ విష‌యంలో నాని త‌ప్పు చేసిన‌ట్లు నెటిజ‌న్స్ అంటున్నారు. దీనిపై నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ కూడా క్లారిటీ ఇచ్చారు. ‘‘త్రివిక్రమ్‌గారి నుంచి వ‌చ్చే అధికారిక ప్ర‌క‌ట‌న ఏదైనా హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, ఫార్‌ట్చూన్ ఫ‌ర్ సినిమా నుంచే వ‌స్తుంది. ఆయ‌న‌కు సోష‌ల్ మీడియాలో అకౌంట్ లేదు. ఆయ‌న పేరుతోనో, ఫొటోనో ఉన్న ఇత‌ర అకౌంట్స్ నుంచి వ‌చ్చే కామెంట్స్‌ను ప‌ట్టించుకోవ‌ద్దు’’ అని తెలిపారు. మ‌రో వైపు త్రివిక్ర‌మ్ పేరుతో ట్వీట్ చేసిన వారు మంత్రి నాని ట్యాగ్ చేస్తూ మ‌మ్మ‌ల్ని న‌మ్మినందుకు ధ‌న్య‌వాదాలు సార్ అని పోస్ట్‌చేయ‌డం కొస‌మెరుపు. రీసెంట్‌గానే ఏపీ ప్ర‌భుత్వం ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకు రాబోతున్న‌ట్లు, అందులో ప్ర‌భుత్వ రేట్ల‌కు టికెట్స్ అమ్మ‌డం ద్వారా పారద‌ర్శ‌క‌త పెరుగుతుంద‌ని అన్నారు. సినీ ప‌రిశ్ర‌మ చిన్న‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు వినోదాన్ని కోరుకుంటే దానిపై ఎక్కువ రేట్స్ పెట్టి ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు తీసుకుంటున్నార‌ని అన్నారు. దీన్ని కంట్రోల్ చేయ‌డానికి ఆన్‌లైన్ టికెటింగ్ వ్య‌వ‌స్థ ద్వారా టికెట్స్‌ను తీసుకు రాబోతున్న‌ట్లు ఆయ‌న అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xvb1io

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk