Thursday, 25 November 2021

Anchor Anasuya: ప్రభుదేవాతో అనసూయ ఫ్లాష్‌ బ్యాక్.. జబర్దస్త్ యాంకర్ మరో యాంగిల్!!

బుల్లితెరపై జబర్దస్తీ చేస్తూనే వెండితెరపై హంగామా చేస్తోంది . రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. లేడీ ఓరియెంటడ్ సినిమాలు మొదలుకొని చిన్న సినిమాలు, పెద్ద సినిమాల్లో అనసూయకు స్పెషల్ రోల్స్ ఇస్తూ ఆహ్వానం పలుకుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే డాన్స్ మాస్టర్, హీరో ప్రభుదేవాతో ఓ వైవిద్యభరితమైన సినిమా చేస్తోంది అనసూయ. ఆ సినిమానే ''. ప్రభుదేవా, , అనసూయల కాంబినేషన్‌లో అభిషేక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పి రమేష్ పిళ్లై ఈ ‘ఫ్లాష్ బ్యాక్’ మూవీ నిర్మిస్తున్నారు. 'గుర్తుకొస్తున్నాయి' అనేది ఉప శీర్షిక. ఇది వరకు రెండు సినిమాలను తెరకెక్కించిన డాన్ సాండీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. చిత్ర షూటింగ్ ఫినిష్ కావడంతో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఫ్లాష్ బ్యాక్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల చేతుల మీదుగా రెండు విభిన్న పోస్టర్లు విడుదల చేసి ఆసక్తి రేకెత్తించారు. ఒక పోస్టర్‌లో , రెజీనాల లవ్ ట్రాక్ చూపిస్తే.. రెండో పోస్టర్‌లో అనసూయ లుక్‌ రివీల్ చేశారు. ఈ రెండు పోస్టర్లను హీరోయిన్ రెజీనా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా విశేష స్పందన లభిస్తోంది. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. మరోవైపు ఆచార్య, ఖిలాడి, పక్కా కమర్షియల్, రంగమార్తాండ సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ.. పాత్ర నచ్చితే ఎలాంటి రోల్ అయినా చేయడానికి సిద్దమే అంటోంది. ఈ నేపథ్యంలోనే ఇతర భాషా చిత్రాలను సైతం ఓకే చేస్తోంది ఈ జబర్దస్త్ బ్యూటీ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FRtqJc

No comments:

Post a Comment

'This Roller Coaster Has Taught Me To...'

'...just be neutral about everything.' from rediff Top Interviews https://ift.tt/p3n6AQF