Sunday, 7 November 2021

తప్పిన ప్రమాదం!.. నీళ్లలో పడిపోబోయిన శ్రియ కూతురు

సరన్, ఆమె భర్త ఆండ్రూ ఇద్దరూ ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. తాము గత ఏడాది లాక్డౌన్‌లో తల్లిదండ్రులయ్యామని, ఆ బిడ్డ పేరు రాధ అనే ఒకేసారి ప్రకటించారు. మొత్తానికి అలా అందరూ ఆశ్చర్యపోయినా కూడా శ్రియా తల్లిగా మారడంపై అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రియా, ఆండ్రూలు కలిసి సోషల్ మీడయాలో చేసే అల్లరికి అందరూ ఫిదా అవుతుంటారు. వీరిద్దరి సరసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంటాయి. వెకేషన్లు అంటూ నిత్యం ఎక్కడికో ఒక చోటకు వెళ్తుంటారు. ఆండ్రూ, శ్రియల ముద్దులాటలు కూడా వైరల్ అవుతుంటాయి. మొన్నా మధ్య జీ తెలుగు కుటుంబ అవార్డు వేడుకల్లో భర్తకు శ్రియా లిప్ లాక్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. కార్వాచౌత్‌కు సంబంధించిన వీడియోల్లోనూ శ్రియ, ఆండ్రూలు హగ్గులతో హంగామా చేశారు. అయితే ఈ సండేను తమ బిడ్డతో కలిసి ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. బిడ్డతో కలిసి అలా సరదగా ఆడుతూ పాడుతూ ఉన్నట్టు కనిపిస్తోంది. బుజ్జిపాపను గుర్రమెక్కియాలని శ్రియా ప్రయత్నించినట్టుంది. ఇక ఆండ్రూ స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలు ఆడుతున్నాడు. చివర్లో తమ బిడ్డ అలా కూర్చుని ఆడుతోంది. అలా ఒక్కసారిగా ఆ బుజ్జి చిన్నారి రాధ స్లిప్ అయి నీళ్లలో పడబోయింది. కానీ పాప ముందే ఆండ్రూ ఉండటంతో చటుక్కున పట్టేసుకున్నాడు. దీంతో శ్రియ ఊపిరి పీల్చుకుంది. బెస్ట్ డాడీ అంటూ ఆండ్రూకు కాంప్లిమెంట్ ఇచ్చింది. శ్రియ ఇక వచ్చే ఏడాది ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3CTjJc7

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....