Sunday, 7 November 2021

అక్కడ కూడా ‘బంగార్రాజు’ సరసాలు.. లడ్డుందా? అంటూ నాగ్ చిందులు!

కింగ్ సోగ్గాడే చిన్ని నాయన చిత్రంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. వరుస ఫ్లాపులతో సతమతవుతూ వచ్చిన నాగార్జునకు ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలు నిజంగానే ఊపిరినిచ్చింది. ఆ తరువాత మళ్లీ నాగ్ చిత్రాలు వర్కవుట్ అవ్వలేదు. ఈ సారి సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ప్రీక్వెల్‌ అయిన బంగార్రాజుతో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. అందుకే మళ్లీ కళ్యాణ్ కృష్ణకే నాగ్ అవకాశం ఇచ్చాడు. రమ్యకృష్ణను మళ్లీ రంగంలోకి దించాడు. ఇక ఈసారి నాగచైతన్య, కృతి శెట్టిలు కూడా బంగార్రాజుతో కలిసి సందడి చేస్తారేమో. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి కూడా అనూప్ రూబెన్స్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకున్నాడు. మనం, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలతో అక్కినేని అభిమానులకు అనూప్ ఫేవరేట్‌గా మారిపోయాడు. అందుకే బంగార్రాజుకు కూడా అనూప్‌నే ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ వచ్చింది. నవంబర్ 9న ఉదయం 9:09 మొదటి పాట ? లిరికల్ వీడియో రిలీజ్ కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో స్వర్గంలో ఉన్నట్టు కనిపిస్తోంది. అక్కడ కూడా తన సరసాలను వదిలిపెట్టనట్టు కనిపిస్తోంది. ఎవరో ఒక దేవ కన్యతో సరసాలు ఆడుతున్నట్టున్నాడు. ఆ భామ ఎవరన్నది పోస్టర్‌తో రివీల్ చేయలేదు. ఇక నవంబర్ 9న ఆ భామ ఎవరో తెలియనుంది. ‘బంగార్రాజు’ను కళ్యాణ్ కృష్ణ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉండబోతోన్నాయట. ఈ చిత్రంలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ వంటి వారు నటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3CX9qno

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....