Sunday, 21 March 2021

Nithiin: పవన్, త్రివిక్రమ్ నా వెనుక ఉన్నారు.. నా దమ్ము, ధైర్యం వాళ్లే: నితిన్ పవర్ స్టార్‌ని మళ్లీ వాడేశాడు

‘చెక్’ అస్సాం పోయింది.. ‘’ తో హైదరాబాద్ తిరిగి వస్తా అన్నారు హీరో . వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ్ దే’ మూవీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక తన సినిమా గురించి నితిన్ ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ నామస్మరణ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘శిల్పకళావేదికలో అఆ ఆడియో వేడుక జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెస్ట్‌గా వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ వేదికపై మాట్లాడుతున్నా. ఆ రోజు మా గురువుగారూ త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. రంగ్ దే సినిమా విషయానికి వస్తే.. నరేష్, రోహిణిలతో చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఏ సినిమాలోనైనా ఫాదర్ క్యారెక్టర్ అనగానే నరేష్‌గారినే వెతుకుతారు. ఆయన వీలుకాకుంటే వేరే వాళ్లని ట్రై చేస్తారు. మా ఇద్దరి పేర్ మా ఇద్దరిది. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్యా సీన్స్ చాలా బాగుంటాయి. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ చాలా బాగా చేశారు. భీష్మ ముందు నాకు మూడు ఫ్లాప్‌లు ఉన్నాయి. కిషోర్ నాతో చేసి నాకు హిట్ ఇచ్చినందుకు చాలా థాంక్స్. మన చెక్ సినిమా మొన్ననే అస్సాం పోయింది. కిషోర్ గారు ఈ సినిమాతో నన్ను మళ్లీ హైదరాబాద్ తేవాలనుకున్నారు.. చాలా థాంక్స్ కిషోర్ గారూ.. అలాగే అభినవ్ కూడా ఈ సినిమాలో బాాగా చేశారు. ఈ సినిమాకి పీసీ శ్రీరామ్ గారు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇది ఆయనతో రెండో సినిమా. అంతకు ముందు ఇష్క్ చేశాం. రంగ్ దే ఇష్క్ కంటే పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నా. ఈ సినిమాలో నా ఏజ్ 24. కానీ నాకు రియల్ ఏజ్ 36 ఏళ్లు. కథ విన్నప్పుడు ఫస్ట్ కథ అంతా చాలా బాగుంది కానీ.. నేను కాలేజ్ స్టూడెంట్ ఏంటీ? అని భయపడ్డా కానీ.. సినిమాలో కీర్తీ కంటే నేనే చాలా యంగ్‌గా కనిపిస్తాను.. ఇక కీర్తీ అనగానే మనకు గుర్తొచ్చేది మహానటి అని. కానీ ఈ సినిమాలో మహా నాటీ.. మహా నాటు.. ఈ సినిమాలో అసలు నన్ను టార్చర్ పెట్టే క్యారెక్టర్. చాలా బాగా చేసింది. నిజానికి కీర్తి మొన్న తప్పిపోయింది.. వెంటనే మిస్సింగ్ అని ట్వీట్ పెట్టాను.. వెంటనే ఆమెను పట్టుకుని తీసుకొచ్చారు మీరంతా. థాంక్యూ మీకు. డైరెక్టర్ వెంకీ అట్లురి ఎక్కువగా లవ్ సినిమా తీస్తుంటారు. అందులో సెన్సివిటీ ఉంటుంది బాగా. ఆయనకి కాలేజ్‌లో చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయట. కొన్ని నేను విన్నాను. చాలా క్రేజీగా ఉంటాయి ఆ లవ్ స్టోరీస్. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇది మా ఫస్ట్ కాంబో.. ముందు ముందు ఇంకా చేయాలని అనుకుంటున్నా. హారిక అండ్ హాసిని సితారా బేనర్‌లో నాకు ఇది మూడు సినిమా.. మొదటిది అఆ, రెండో సినిమా భీష్మా.. మూడోది ఈ రంగ్ దే. సెంట్‌మెంట్ ఏంటంటే.. అఆ ముందు ఓ ప్లాప్ ఉంది అఆ ఇచ్చారు. భీష్మా ముందో ప్లాప్ ఉంది భీష్మా ఇచ్చారు. దీని ముందు ఓ ప్లాప్ ఉంది మళ్లీ నాకు రంగ్‌దే ఇస్తున్నారు.. ఇక సినిమా గురించి అంతా చెప్పాను కానీ త్రివిక్రమ్ గారు.. నా లవ్.. షాలినీ లవ్వే అనుకోండి.. షాలినీ కాకుండా ఇంకో లవ్ త్రివిక్రమ్ గారు. ఇక ఆయన నా గురించి పొగిడి నేను ఆయన గురించి పొగిడి ఇదంతా వేస్ట్ గానీ.. ఒకటే చెబుతాను సింపుల్‌గా షార్ట్‌గా చెప్పేస్తాను. సినిమా ఇండస్ట్రీలో నాకు రెండు కళ్లు ఎవరంటే ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌గారు.. అండ్ త్రివిక్రమ్ గారు.. వీళ్లు నా వెనుక ఉన్నారు అదే నా ధైర్యం.. అదే నా దమ్ము.. ఇంతకంటే నేను ఏం చెప్పలేను’ అంటూ స్పీచ్ ముగించారు నితిన్. అయితే నితిన్ మాట్లాడుతున్నప్పుడు పవన్ అభిమానులు ఎప్పటిలాగే రచ్చ రచ్చ చేశారు.. పవర్ స్టార్ వకీల్ సాబ్ అని కేకలు వేయడంతో.. నితిన్ వాళ్లకి మరింత ఉత్సాహాన్నిస్తూ.. వకీల్ సాబ్ ఏప్రియల్ 9 అందరం కలిసి వెళ్దాం.. ఫస్ట్ డే మార్నింగ్ షో.. అని అన్నారు నితిన్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3f0L9n6

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....