Sunday 21 March 2021

Rang De: కాస్త కలర్ నాకూ ఇవ్వండి.. గెడ్డానికి వేసుకుని వయసు తగ్గించుకుంటా: త్రివిక్రమ్

హీరో నితిన్ తనకు తమ్ముడు లాంటి వాడని అన్నారు దర్శకుడు . నితిన్ హీరోగా నటించిన ‘’ మూవీ ప్రీ రిలీజ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తర్వాత నరేష్ గారిని రోహిణి గారిని కలిశాం. కోవిడ్ వల్ల కలవలేదు. మన ‘అలవైకుంఠపురం’లో ఫంక్షన్ తర్వాత ఇదే కలవడం.. ఈ సినిమా కూడా నేను చూశాను.. చాలా బాగా చేశారు మీరు ఇద్దరూ. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది.. అర్జున్ అండ్ అను. అంటే నితిన్ అండ్ కీర్తీ.. తెలీకుండానే నాకొకటి అనిపించింది.. వీళ్లు కూడా అఆలో ఉన్నారు.. నా సినిమా అఆ.. ఈ సినిమా కూడా అఆనే. ఇది కూడా అంతకు మించి హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నితిన్ నా తమ్ముడు లాంటోడు. సో అతడి సినిమా ఏదైనా సరే బాగా ఆడాలని కోరుకుంటాను నేను. అండ్ ఈ సినిమాలో పని చేసిన అందరికీ మనస్పూర్తిగా నా అభినందనలు చెబుతున్నాను.. నా మిత్రుడు దేవీ.. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు కానీ దేవి మంచి ఎంటర్‌టైనర్. సో ఇతడు ఎక్కడుంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లోంచి ఏదొకటి తీసి పాడి మనందరినీ ఆనందింపచేయగలడు. సినిమాలో కూడా అంతే ఎలాంటి పరిస్థితుల్లోంచైనా ఒకపాటని తయారు చెయ్యగలడు. దాన్ని సూపర్ హిట్ చెయ్యగలడు. మనందరి చేత స్టెప్స్ వేయించగలడు. ఇండియా మొత్తానికి గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో దేవీ కూడా ఒకడు. ముఖ్యంగా క్లాసికల్ బ్యాగ్రౌండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. దేవీ అంటే ఇష్టంతో పాటు గౌరవం కూడా నాకు. ఇందులోని ఊరంతా చీకటి పాట ఉంది కదా.. దాన్ని మీరు సినిమాలో చూసినప్పుడు మీ కళ్లలో కచ్చితంగా నీళ్లు తిరుగుతాయి.. అంత అద్భుతమైన కంపోజిషన్ అది. సో సినిమాలో పాటని చూడగలగడం అనేది సినిమా రావడానికంటే ముందే చెయ్యగలిగిన డైరెక్టర్ కాబట్టి ఇన్నేళ్లపాటు టాప్‌లో ఉన్నాడు దేవి. ‘ఇక ఈ సినిమా గురించి రెండు మాటలంటే.. సాధారణంగా ఏం చెబుతారంటే.. అన్ని జంతువులు నవ్వలేవు.. కేవలం మనిషి మాత్రమే నవ్వగలడు అని చెబుతారు కాదా.. అలాగే అన్ని జంతువులకు కూడా వస్తువులు బ్లాక్ అండ్ వైట్‌లోనే కనిపిస్తాయి. అన్ని రంగులు కనపడవు. మనుషులకు మాత్రమే 7 రంగులు చూసే అదృష్టం ఉంది. అలాగే ఈ సినిమా కూడా మీకు జీవితంలో ఉన్న 7 రంగుల్ని చూపిస్తుంది. రంగ్ దే అంటే కలర్ ఇవ్వండి అని. కొంచెం కలర్ ఇవ్వండి.. నా గడ్డానికి కూడా వేసుకుంటాను.. కాస్త వయసు తగ్గించుకుంటాను..’ అంటూ చమత్కరిస్తూనే రంగ్ దే టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పి ముగించారు త్రివిక్రమ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3f1bmSp

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...