Sunday, 7 March 2021

రాత్రి మందు కొట్టడం.. పగలు ఫ్యాన్స్‌ని కొట్టడం.. బాలకృష్ణపై ఎంపీ గోరంట్ల మాధవ్ షాకింగ్ కామెంట్స్

హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అగ్ర హీరో, ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంపపై కొట్టిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలోనూ ఇలా అభిమానులపై బాలయ్య చేయిచేసుకున్న సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఈ ఉదంతం జనాల్లో పలు చర్చలకు దారి తీసింది. ప్రతిపక్షాలు బాలకృష్ణ ప్రవర్తించిన తీరును తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న గోరంట్ల మాధవ్.. బాలకృష్ణ ప్రవర్తనపై మండిపడ్డారు. ఓ ప్రజా ప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు అది కాదని, ఇలాంటి ఉదంతాలను ఎవ్వరూ సమర్దించరని అన్నారు. టీడీపీకి ఓటేసిన పాపానికి అభిమానులు ఇలాంటి శిక్ష అనుభవించాలా అంటూ ఎద్దేవా చేశారు. రాత్రి కాగానే మందు తాగడం, పగలు ప్రజలను కొట్టడం బాలకృష్ణకు అలవాటుగా మారిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రజా ప్రతినిధిగా ప్రజలకు ఆయన ఎలాంటి సందేశం ఇస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఫైర్ అయ్యారు గోరంట్ల. దీంతో ఈ ఇష్యూ ఇటు రాజకీయ వర్గాలతో పాటు అటు సినీ వర్గాలతో పాటు హాట్ టాపిక్ అయింది. రాజకీయాలతో బిజీ బిజీగా అంటూనే తన సినిమా పనులు చూసుకుంటున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా BB3 లో నటిస్తున్నారు. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బోయపాటి మార్క్ చూపిస్తూ మాస్ ఆడియన్స్ ఊగిపోయేలా ఈ సినిమా రూపొందిస్తున్నారట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3v0S1Xg

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....