Sunday, 7 March 2021

ఖరీదైన కారవాన్ కొన్న మహేష్ బాబు.. రేంజ్‌కి తగ్గట్లుగా అత్యాధునిక సదుపాయాలు! భలేగా శ్రీమంతుడి వాహనం

ఒకప్పటిలా లేదు ట్రెండ్.. ఎంత రిచ్‌గా కనిపిస్తే అంత బెటర్ అన్నట్లుగా లోకం వెళుతోంది. ఈ మేరకు ఖరీదైన వాహనాలు కొనుగోలు చేస్తున్నారంతా. ఇక సినీ సెలబ్రిటీలైతే కొత్త మోడల్ కార్స్, ఖరీదైన కరవాన్స్ కొనుగోలు చేస్తూ రేంజ్ చూపించుకుంటున్నారు. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అత్యాధునిక కారవాన్ కొనుగోలు చేయగా.. తాజాగా కూడా అదే బాటలో కాస్లీ కారవాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని సౌకర్యాలతో కూడిన మామూలు కారవాన్‌ను ఉపయోగిస్తున్న మహేష్‌.. తన అభిరుచికి తగినట్లు ఆధునిక హంగులు, అత్యాధునిక సదుపాయాలతో కొత్త కారవాన్‌ వాహనాన్ని సిద్ధం చేసుకున్నారట. ఈ కారవాన్‌ ఇంటీరియర్‌ డిజైన్ల కోసం ఓ ముంబై కంపెనీ ఎంతో శ్రమించిందని, ఇందుకోసం మహేష్ కూడా భారీగానే ఖర్చు చేశారని టాక్ నడుస్తోంది. పైగా దీనికి తన లక్కీ నెంబర్ 4005 ఎంచుకున్నారట ఈ సూపర్ స్టార్. ప్రస్తుతం ఈ కారవాన్‌కు ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. శ్రీమంతుడి వాహనం భలేగా ఉందే! సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇది చూసిన నెటిజన్లు. మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస హిట్స్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం '' మూవీ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. హీరోగా నటిస్తూనే చిత్ర నిర్మాణంలో భాగమవుతున్నారు మహేష్. సూపర్ స్టార్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38i7wQO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....