Friday, 25 December 2020

లగ్జరీ ఇంటికి మారిన రాజ్‌తరుణ్.... గృహ ప్రవేశంలో అవికా గోర్ సందడి

‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. ఆ తర్వాత వరుస హిట్లతో బిజీ హీరోగా మారిపోయాడు. అయితే కథల ఎంపికలో పొరపాట్లు చేయడంతో సక్సెస్‌ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా అతడి కెరీర్‌కి కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు చేతిలో ఉన్న మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. Also Read: కొన్నాళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్న రాజ్‌తరుణ్ సినిమాల్లో తాను సంపాదనతో ఓ లగ్జరీ ఇంటిని సొంతం చేసుకున్నాడు. బంధు మిత్రులు, సన్నిహితుల మధ్య గృహ ప్రవేశ వేడుకను ఘనంగా నిర్వహించాడు. అయితే ఈ కార్యక్రమంలో హీరోయిన్ అవికా గోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకకు హాజరైన అవికా.. రాజ్‌తరుణ్ తల్లిదండ్రులతో అత్యంత సన్నిహితంగా మెలిగింది. అవికా గోర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన రాజ్‌తరుణ్ ఆమెకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. ‘నా మొదటి సినిమా నుండి గృహ ప్రవేశం వరకు అన్నింటా తనకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ పోస్ట్ చూసిన అవికా.. ‘హ్యాపీ టియర్స్’ అంటూ కామెంట్ పెట్టింది. అవికాతో పాటు తనకు ‘ఒరేయ్ బుజ్జిగా’ దర్శకుడు విజయ్ కుమార్ కొండా కూడా ఈ ఫంక్షన్‌కి హాజరయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JjJqfc

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....