వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో అందాలతో మాయ చేస్తున్నారు నేటితరం యంగ్ హీరోయిన్స్. ఎప్పటికప్పుడు తమ తమ లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ కలర్‌ఫుల్ ఫోటోషూట్లతో ఆకర్షిస్తున్నారు. ఏ మాత్రం సమయం దొరికినా నెటిజన్లతో ముచ్చటిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే అచ్చతెలుగు హీరోయిన్, యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా లైవ్ చాట్ చేస్తూ తన స్కూల్ డేస్‌లో చేసిన కొంటె పనులను ఓపెన్‌గా చెప్పేసింది. వెండితెరపై పద్దతిగా కనిపిస్తూనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆన్‌లైన్ వేదికలను మాత్రం తన అందాలతో వేడెక్కిస్తోంది. కుర్రకారు షేక్ అయ్యేలా ఎప్పటికపుడు ఫ్రెష్ అండ్ గ్లామర్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల నెటిజన్లతో చాట్ చేసిన ఈ అమ్మడు బోల్డ్ మాటలతో పిచ్చెక్కించింది. స్కూల్ డేస్‌లో చేసిన కొంటె పనులు.. ముద్దు, ముచ్చట గురించి చెబుతూ అడల్ట్ కిక్కిచ్చింది. Also Read: కొన్నేళ్ల క్రితం ఒక సందర్భంలో ఓ వ్యక్తి తనకు ముద్దుపెట్టాలని బాగా ప్రయత్నం చేశాడని చెబుతూ ఓపెన్ అయింది. అయితే ఆ సమయంలో తాను వద్దని వారించడంతో ఆ ముద్దు అక్కడే ఆగిపోయిందని తెలిపింది. కాకపోతే ముద్దు పెట్టుకోవాలని చూసిన ఆ వ్యక్తి ఎవరు? అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది ఈ లేడీ బ్యాచిలర్. ఇక స్కూల్ డేస్‌లో బబుల్‌గమ్ నమిలి దాన్ని బెంచీ కింద అంటించడం, పరీక్షల్లో చీట్ చేయడం లాంటి ఎన్నో చిలిపి పనులు చేశానని చెప్పిన ఈషా.. జీవితంలో వాటిని మించిన తీపి జ్ఞాపకాలు లేవని తెలిపింది. Also Read: ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి కొన్నేళ్లపాటు పద్ధతైన దుస్తుల్లో కనిపించిన ఈషా రెబ్బా.. ఇకపై బోల్డ్ పాత్రల్లో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ తెలుగు వర్షన్‌లో నటిస్తోంది. స్వయంతృప్తి పొందే మహిళగా బోల్డ్ రోల్ పోషిస్తోంది. దీంతో ఈషా బెడ్ సీన్ చూడాలని ఆతృతగా ఉన్నారు యూత్ ఆడియన్స్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3n9PNRk
No comments:
Post a Comment