టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నాకు అప్పుడే వింటర్ వచ్చేసింది. అందుకే స్వెటర్ వేసుకుని కెమెరాకు పోజులిచ్చారు. కాకపోతే, ఆమె ఈ స్వెటర్ తప్ప ఇంకేమీ వేసుకోలేదు. దీంతో ఈ ఫొటోషూట్ హాట్‌గా మారిపోయింది. క్రీమ్ కలర్ స్వెటర్‌లో చాలా సెక్సీగా కనిపిస్తున్నారు. స్వెటర్ పైబటన్ విప్పి ఎద అందాలను ఆరబోస్తున్నారు. తన స్కిన్ టోన్‌ను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తున్నాయి. రాశీ ఖన్నా ఇంత హాట్‌గా ఎప్పుడూ కనిపించలేదని, చాలా సెక్సీగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, 2014లో నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో రాశీ ఖన్నా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమాతో కుర్రకారును కట్టిపడేశారు. ఆ తరవాత ఈ ఢిల్లీ బ్యూటీకి వరుసపెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీ అపోయారు. ‘జోరు’, ‘జిల్’, ‘శివం’, ‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’, ‘హైపర్’.. ఇలా రాశీ హవా కొనసాగింది. ‘సుప్రీమ్’ సినిమాలో సబ్-ఇన్‌స్పెక్టర్ బెల్లం శ్రీదేవి పాత్ర రాశీ ఖన్నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక 2017లో ‘జై లవకుశ’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం కొట్టేశారు రాశీ. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే, ఈ సినిమా సినిమా తరవాత చాలా రోజులు రాశీ మరో హిట్ అందుకోలేదు. ‘ఆక్సిజన్’, ‘టచ్ చేసి చూడు’, ‘శ్రీనివాస కళ్యాణం’ డిజాస్టర్లు రాశీని ఇబ్బంది పెట్టాయి. అయితే, వీటి మధ్య ‘తొలి ప్రేమ’ పర్వాలేదనిపించింది. ఈ క్రమంలో కిందటేడాది ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో రాశీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ ఏడాది ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో మళ్లీ డిజాస్టర్ అందుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుసగా సినిమాలు చేస్తున్నారు రాశీ ఖన్నా. కిందటేడాది ‘అయోగ్య’ (‘టెంపర్’ రీమేక్) సినిమాతో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ‘అరన్మనై 3’లో నటిస్తున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో ఖాళీగా ఉన్న రాశీ.. మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ హాట్ ఫొటోషూట్ చేసినట్టున్నారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2EXlmfU
No comments:
Post a Comment