Sunday, 4 October 2020

దేవుడి దయ వల్ల బతికే ఉన్నా.. చనిపోయింది నేను కాదు: నితిన్ హీరోయిన్ క్లారిటీ

సినీ తారలపై తప్పుడు వార్తలు ప్రచారం కావడం కొత్తేమీ కాదు. కొంత మంది నటీనటులు బతికుండగానే వారు చనిపోయారని వదంతులు పుట్టుకొచ్చాయి. వేణుమాధవ్ బతికి ఉన్నప్పుడు ఆయన చనిపోయారనే పుకార్లు పుట్టించారు. అలాగే, సీనియర్ నటి జయంతిపై ఇప్పటికీ అలాంటి వార్తలు వస్తుంటాయి. ఇలాంటి తప్పుడు వార్తలకు యువ నటి ఒకరు బలయ్యారు. ఆ నటి ఎవరో కాదు ‘చిన్నదాన నీకోసం’ సినిమాలో నితిన్ సరసన నటించిన . ఆమె శుక్రవారం చనిపోయారంటూ కొన్ని వెబ్‌సైట్లు వార్తలు ప్రచురించాయి. దీంతో మిష్టి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నిజానికి బాలీవుడ్ యువ నటి మిష్టి ముఖర్జీ (27) కిడ్నీ ఫెయిల్యూర్‌తో ప్రాణాలు వదిలారు. 2013లో వచ్చిన ‘మై క్రిష్ణా హు’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన మిష్టి ముఖర్జీ శుక్రవారం సాయంత్రం బెంగళూరులో మరణించారు. గత కొద్ది నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మిష్టి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. Also Read: చనిపోయింది మిష్టి ముఖర్జీ అయితే మిష్టి చక్రవర్తి అని కొన్ని న్యూస్ వెబ్‌సైట్లు వార్తలు ప్రచురించాయి. ఆఖరికి గూగుల్ సెర్చ్‌లో కూడా మిష్టి చక్రవర్తి చనిపోయినట్టు చూపిస్తోంది. దీంతో అవాక్కైన మిష్టి చక్రవర్తి ఇది ఫేక్ న్యూస్ అని సోషల్ మీడియా ద్వారా స్పష్టతనిచ్చారు. తాను బతికే ఉన్నానని, ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. ‘‘కొన్ని మీడియా రిపోర్ట్స్ ఆధారంగా నేను ఈరోజు మరణించాను. దేవుడి దయవల్ల నేను బతికే ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు. కోల్‌కతాకు చెందిన మిష్టి చక్రవర్తి.. 2014లో వచ్చిన ‘కాంచి: ద అన్‌బ్రేకబుల్’ సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అదే ఏడాది ‘చిన్నదాన నీకోసం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. 2015లో ‘కొలంబస్’ చిత్రంలో సుమంత అశ్విన్ సరసన నటించారు. ఆ తరవాత ‘బాబు బాగా బిజీ’, ‘శరభ’, ‘బుర్రకథ’ సినిమాల్లో కనిపించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ మిష్టి చక్రవర్తి నటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3l71uX2

No comments:

Post a Comment

'After Aradhana, People Took Me Seriously'

'Everybody was scared, especially with Rajesh Khanna playing a double role and playing my lover and my son.' from rediff Top Inter...