Sunday, 4 October 2020

గానగంధర్వుడికి దర్శనమ్ స్మృత్యంజలి

గంధర్వ గాయకుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి దర్శనమ్ సభక్తికంగా స్మృత్యంజలి అర్పించింది. దుండిగల్‌లోని మహావిద్యాపీఠంలో ఆదివారం నిర్వహించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి దర్శనమ్ స్మృత్యంజలి కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు. శాంతా బయోటెక్ అధినేత పద్మభూషణ్ వరప్రసాదరెడ్డి, ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, మహావిద్యాపీఠం వ్యవస్థాపకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ సహా పలువురు తెలుగు సినిమా నిర్మాతలు, వేదపండితులు పాల్గొన్నారు. మొదట మహావిద్యాపీఠం వేదపండితులు ఉపనిషత్ పారాయణం, సామవేదగానం, శాంతిపాఠం పాటించారు. అనంతరం విపంచి మ్యూజికల్ అకాడమీ వ్యవస్థాపకులు మరుమాముల శశిధరశర్మ బృందంతో బాలు మధుర గీతాలతో సంగీత విభావరి జరిగింది. అనంతరం జరిగిన స్మృత్యంజలిలో వక్తలు బాలు బహుముఖ ప్రజ్ఞను స్మరించుకుని నివాళులు అర్పించారు. దర్శనమ్ సంపాదకులు మరుమాముల వెంకటరమణ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ స్మృత్యంజలి కార్యక్రమం ఉద్విగ్న భరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో దర్శనమ్ హితవరులు బోర్బట్ల హనుమంతచారి, నరేష్ కులకర్ణి, భీం సేన్ మూర్తి, మద్దికుంట శ్రీకాంత్ శర్మ, నరసింహ మూర్తి, రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. గానగంధర్వ సెప్టెంబర్ 25న కన్నుమూసిన విషయం తెలిసిందే. కరోనాతో పోరాడి 51 రోజులు హాస్పిటల్‌కే పరిమితమైన బాలు.. చివరకు మృత్యువు చేతిలో ఓడారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2F0by51

No comments:

Post a Comment

Must Read: How To Make Money In A Bear Market

'Reduce your equity allocation, put that allocation into gold and fixed income.' from rediff Top Interviews https://ift.tt/Of4n5Ev...