జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించిందని ఆదివారం సాయంత్రం వదంతులు వచ్చాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పర్యటించే ప్రాంతాల్లో ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలను కేంద్ర హోం శాఖ ఆదేశించినట్టు ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని జనసేన కార్యాలయం కొట్టిపారేసింది. ‘‘పవన్ కళ్యాణ్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారనే ప్రచారంలో నిజం లేదు. జెడ్ కేటగిరీ భద్రతపై ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. మేము కూడా పవన్ కళ్యాణ్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరలేదు. కొంత మంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని జనసేన కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంత మంది బీజేపీని టార్గెట్ చేశారు. ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కళ్యాణ్‌కు జెడ్ కేటగిరీ భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. అసలు ఏ అర్హతతో ఈ భద్రత కల్పించారో చెప్పాలని బీజేపీని ట్యాగ్ చేసి మరీ మండిపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే పవన్‌కు ఈ భద్రత కల్పించారని కొంత మంది ఆడిపోసుకున్నారు. అసలు ఆ వార్తలోనే నిజం లేనప్పుడు ఈ ప్రశ్నలన్నీ అనవసరం. అయితే, పవన్ కళ్యాణ్‌కు జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వకూడదా? అనేది ప్రశ్న. ఎందుకు ఇవ్వకూడదు.. ఈ దేశ పౌరుడు ఎవరికైనా ఇవ్వొచ్చు. మన దేశంలో వీఐపీలకు రక్షణ కల్పించేందుకు ఐదు రకాల భద్రతా వ్యవస్థ ఉంది. అవి.. Z+ (హై లెవెల్), Z, Y, X కేటగిరీలు. ప్రాణహాని ఏ స్థాయిలో ఉంది అనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ ఐదు కేటగిరీల్లో భద్రత కల్పిస్తారు. హై కేటగిరీ సెక్యూరిటీని ప్రధాన మంత్రి, అధ్యక్షుడు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, మాజీ ఉన్నతాధికారులు, జడ్జిలు, మాజీ జడ్జిలు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు, ఫిలిం స్టార్లు, ఆధ్యాత్మికవేత్తలకు కల్పిస్తారు. అవసరమైతే సామాన్యుడికి కూడా ఈ కేటగిరీ కింద భద్రత కల్పిస్తారు. కాబట్టి, తనకు ప్రాణహాని ఉందని పవన్ కళ్యాణ్ కోరితే ఆయన కూడా జెడ్ కేటగిరీ భద్రతను కల్పించే అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు, నటుడు-ఎంపీ రవికిషన్‌కు వై కేటగిరీ భద్రతను కల్పించారు. కాబట్టి, తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్‌కు జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36xZbZk
No comments:
Post a Comment