టీవీ షోలు, సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే అనసూయ.. తన ఫ్యామిలీకి కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. షూటింగ్‌ల నుంచి కాస్త విశ్రాంతి దొరికిందంటే చాలు భర్త, పిల్లలతో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఓవైపు ప్రొఫెషన్.. మరోవైపు ఫ్యామిలీ.. ఈ రెండు బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనసూయ. కరోనా సమయంలో షూటింగ్‌లు ఆగిపోయి ఇంట్లోనే ఉన్న అనసూయ కుటుంబంతో ఎంతో ఆనందమైన జీవితాన్ని గడిపారు. మళ్లీ ఇప్పుడు షూటింగ్‌లు మొదలయ్యాయి. ‘జబర్దస్త్’ వంటి షోలతో అనసూయ బిజీ అయిపోయారు. ఈ బిజీ సమయంలోనూ తన భర్త సుశాంక్ భరద్వాజ్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు అనసూయ. భర్త బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోవడానికి గోవా వెళ్లారు. తమ ఇద్దరు పిల్లలు, క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి భరద్వాజ్ బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. గోవాలు తమ హ్యాపీ మూమెంట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అనసూయ పంచుకున్నారు. భర్తను హత్తుకొని తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాపీ బర్త్‌డే మై ఫేవరేట్ హలో.. నాకు ఆకలిగా ఉన్నప్పుడు సైతం నిన్నే ప్రేమిస్తా’’ అంటూ కాస్త చమత్కారంతో భర్తకు శుభాకాంక్షలు చెప్పారు అనసూయ. అయితే, వీటన్నిటికన్నా.. గోవా బీచ్ వద్ద అనసూయ తీసుకున్న హాట్ ఫొటో ఒకటి ఆమె ఫాలోవర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. పసుపు రంగు స్లీవ్‌లెస్ టాప్, పువ్వులతో నిండి ఉన్న చిన్న నిక్కరు వేసుకున్న అనసూయ సముద్రం వైపు చూస్తూ సెక్సీ పోజులో నిలుచున్నారు. ఆమెను వెనక నుంచి ఫొటో తీశారు. ఈ ఫొటోను అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు ఫాలోవర్లు. Also Read: ‘‘సముద్రం అంచున పరుచుకున్న అందం’’ అని ఒకరు.. ‘‘రోజు రోజుకి మరింత హాట్‌గా తయారవుతున్నారు’’ అని మరొకరు.. ‘‘సెక్సీ అట్ సెక్సీ ప్లేస్’’ అని ఇంకొకరు.. ఇలా హాట్ కామెంట్లతో దుమ్ముదులుపుతున్నారు. మొత్తానికి చాలా రోజుల తరవాత తన హాట్ అవతార్‌ని అభిమానులకు చూపించారు అనసూయ. మొత్తం మీద లాక్‌డౌన్ కారణంగా చాలా రోజులు ఇంటికే పరిమితమైన అనసూయ.. ఇప్పుడు అలా విహారయాత్రలకు వెళ్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jGIuhK
No comments:
Post a Comment