Sunday 4 October 2020

Upasana: సమంత నాకు స్ఫూర్తి.. ఓట్స్, క్యారెట్ ఇడ్లీకి పడిపోయిన ఉపాసన

యువర్ లైఫ్ వెబ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కోసం సెలబ్రిటీ వైవ్స్ సమంత, కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆరోగ్యవంతమైన ఆహారం, ఫిట్‌నెస్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా చక్కటి హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా వంటకాలను వండి చూపించారు. దీనిలో భాగంగా ఈ వారం ఆమె ఓట్స్ క్యారెట్ ఇడ్లీ చేశారు. సాధారణ ఇడ్లీల్లో కార్బొహైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.. కాబట్టి అది పూర్తి పోషకాలను ఇవ్వదు. ఓట్స్, క్యారెట్ చేర్చడం వల్ల ఆ ఇడ్లీ పోషకాహారంగా మారిపోతుంది. అందుకే సమంత ఈ రెసిపీని ఎంచుకున్నారు. తాను వారంలో రెండు మూడు సార్లైనా ఇడ్లీని అల్పాహారంగా తీసుకుంటానని చెప్పారు. సమంత చేసిన ఈ వంటకం వీడియోను ఉపాసన యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు ఉపాసన. ఈ ఓట్స్, క్యారెట్ ఇడ్లీని ఎలా తయారు చేయాలో సమంత చూపించారు. Also Read: ఉపాసన, సమంత వంట చేస్తూ సరదాగా మాట్లాడుకున్నారు. ఉపాసన మాట్లాడుతూ సమంత తనకు స్ఫూర్తి అని అన్నారు. సమంత హెల్దీ ఫిట్‌ఫుల్ ఫిల్లింగ్ లైఫ్‌ను లీడ్ చేస్తుంటారని ఉపాసన చెప్పారు. ఉపాసన అలా చెబుతుంటే సమంత టీజింగ్‌గా నవ్వారు. తమ ఇంట్లో ఇడ్లీ ఉదయం, సాయంత్రం కూడా టిఫిన్‌లా తీసుకుంటామని ఉపాసన చెప్పారు. ఉపాసన తనతో చాట్ చేస్తూ ఉంటే, సమంత చకచకా ఓట్స్, క్యారెట్ ఇడ్లీ చేసేశారు. సమంత తయారుచేసిన ఇడ్లీని ఇద్దరూ టేస్ట్ చేశారు. సమంత ఓట్స్ క్యారెట్ ఇడ్లీ రుచి చూశాక.. ఇలాంటి ఇడ్లీలైతే తాను రోజూ తింటానని ఉపాసన చెప్పారు. ఇడ్లీ బాగుందా అని సమంత తమిళంలో అడిగితే.. ఉపాసన కూడా తమిళంలో అదిరిపోయిందని సమాధానం ఇచ్చారు. వీడియోలో చివరిగా ఫుడ్ సైన్, న్యూట్రిషన్‌లో పీహెచ్‌డీ చేసిన డాక్టర్ లక్ష్మి ఈ ఓట్స్, క్యారెట్ ఇడ్లీ ఎంత ఆరోగ్యకరమో చెప్పారు. కాగా, యువర్ లైఫ్ వెబ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు సమంత గెస్ట్ ఎడిటర్‌గా తన హెల్దీ టిప్స్ పంచుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33telx5

No comments:

Post a Comment

'Rekha And I Didn't Speak To Each Other For 20 Years'

'Rekha and my wife were close friends, and my so-called cold war with Rekha was causing difficulties in my wife's friendship with he...