దేశంలో విలయతాండవం చేస్తూ కోట్లాది జనాన్ని వణికిస్తోంది మహమ్మారి. ఈ వైరస్ ఉదృతి రోజురోజుకూ పెరుగుతూ లక్షలాది మంది కరోనా బారిన పడుతుండటం చూస్తూనే ఉన్నాం. పేద- ధనిక, సాధారణ- సెలబ్రిటీ అనే తేడాలేకుండా ఎంతోమంది ఆరోగ్యంపై దెబ్బ కొడుతోంది కరోనా. ఇప్పటికే ఎంతోమంది సినీ తారలు కరోనా బారిన పడ్డారు. ఇందులో కొందరు కోలుకోగా.. ఇంకొందరు ఆ మహమ్మారి దాడికి బలైపోవడం సినీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో స్టార్ హీరోయిన్ సైతం కరోనా బారిన పడిందని తెలిసి ఆందోళన చెందుతున్నారు ప్రేక్షకులు. Also Read: కొన్నిరోజుల క్రితం తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారితోనే కలిసి ఉన్న మిల్కీ బ్యూటీ టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ అనే రిపోర్ట్ రావడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇటీవలే షూటింగ్స్ రీ ఓపెన్ కావడంతో ఓ సినిమా షూటింగ్ కోసం తమన్నా హైదరాబాద్ వచ్చింది. ఇంతలో ఆమెకు హై ఫీవర్ రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా కరోనా టెస్ట్ చేశారు. ఈ రిపోర్ట్‌లో ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో అంతా షాకయ్యారు. తమన్నాకు అని తెలిసినప్పటికీ ఇన్‌ఫెక్షన్ ఎంత ఉండనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ''గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధధూన్ రీమేక్‌తో పాటు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది తమన్నా.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3l6yLSc
No comments:
Post a Comment