‘నేను శైలజ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చిన ఆమెకు అలనాటి హీరోయిన్ సావిత్రి బయోపిక్ ‘మహానటి’ శిఖరస్థాయి ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె అద్భుత నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు సైతం అందుకుంది. ఆ క్రేజ్‌తో వరుసబెట్టి సినిమాలు చేయడంతో పాటు వాణిజ్య ప్రకనటనల్లోనూ సందడి చేస్తోంది. ఆమె నటించిన పెంగ్విన్ లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Also Read: అయితే ఎప్పుడూ బొద్దుగా కనిపించే కీర్తిసురేష్ ఇప్పుడు సన్నబడిపోయింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోను చూసిన ఫ్యాన్స్ షాకయ్యారు. ఒంటిమీద కేజీ కండ కూడా లేనట్లుగా మరీ సన్నగా కనిపిస్తోంది. దీంతో ఆమె నిజంగానే అలా మారిందా? లేక కెమెరా ట్రిక్‌తో అలా కనిపిస్తుందా? అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎప్పుడూ బొద్దుగా ముద్దుగా కనిపించే తమ హీరోయిన్ ఇలా సన్నబడి లుక్ మొత్తం చెడగొట్టుకుందని పీలవుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30xnrXz
No comments:
Post a Comment