ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి కరోనా తెచ్చిన తిప్పలు అంతా ఇంతా అని చెప్పలేం. కెమెరాలు, థియేటర్ గేట్లు అన్నింటికీ తాళం పెట్టించేసి సినీ కార్మికుల వెన్నువిరిచింది కరోనా మహమ్మారి. కాగా లాక్‌డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా మూతపడిన థియేటర్స్ ఇక రీ ఓపెన్ చేసుకోవచ్చని ఇటీవలే ప్రకటించింది కేంద్రప్రభుత్వం. లాక్‌డౌన్ 5.0 లో భాగంగా ఈ సడలింపు ఇస్తూ థియేటర్స్ రీ ఓపెన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతో కొన్ని రాష్ట్రాలు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఈ విషయమై రియాక్ట్ అయ్యారు . 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు జక్కన్న. సాధారణంగా విమానాల్లోనే రెండు, మూడు గంటలు ప్రయాణిస్తున్నారు. విమానాలతో పోల్చితే థియేటర్ సీట్ల మధ్య ఎక్కవ గ్యాప్ ఉంటుంది. అలాంటప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ ఓపెన్ చేసుకోండని చెప్పడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. అయితే టెంపరరీగా ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చని తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. Also Read: ఇకపోతే సినిమా విశేషాలపై స్పందించిన ఆయన.. నందమూరి అభిమానులకు త్వరలోనే శుభవార్త చెబుతానని అన్నారు. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ అతిత్వరలో రిలీజ్ చేస్తామని అన్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో RRR రిలీజ్ డేట్ చెప్పలేనని తెలిపారు. ఈ సమయంలో కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో షూటింగ్ చేయాల్సిన అవసరముంది కాబట్టి అనుకున్న సమయంలోనే షూటింగ్ చేస్తున్నానా? అని చూసుకోవాలి. అదేవిధంగా ప్రాక్టికల్ సమస్యలపై దృష్టి పెట్టాలి. సో.. రిలీజ్ డేట్ ఇప్పుడే చెప్పలేం అని తెలిపారు. కంటిన్యూగా రెండు నెలలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నామని, ఆ రెండు నెలలు షూటింగ్ అనుకున్నట్లు జరిగితేనే రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ ఇవ్వగలుగుతానని అన్నారు. ఎక్కడికీ వెళ్లకుండా హైదరాబాద్‌లోనే షూటింగ్ చేయాలని అనుకుంటున్నామని, కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ ఎలా చేయాలనే దానిపై పక్కాగా ప్లాన్ చేసుకున్నామని రాజమౌళి పేర్కొన్నారు. సో.. జక్కన్న మాటలు చూస్తుంటే ఆయన ముందుగా చెప్పిన 2021 జనవరి 8వ తేదీన RRR విడుదల కష్టమే అనిపిస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cSKHo1
No comments:
Post a Comment