Saturday 3 October 2020

Puri Jagannadh: వయసులో ఉన్న ఆడపిల్ల స్వామిజీ ఆశ్రమానికి వెళ్లి! దూల తీరిందన్న పూరి జగన్నాథ్

లాక్‌డౌన్ వేళ పూరి మ్యుసింగ్స్ అంటూ పోడ్ కాస్ట్ ఆడియోలు రిలీజ్ చేస్తూ ఆలోచనలు రేకెత్తించే మాటలు చెబుతున్నారు డైరెక్టర్ . దేశవిదేశాల ముచ్చట్లతో పాటు యువత ఎలా ఉండాలనే దానిపై మోటివేట్ చేసే కథలు వినిపిస్తున్నారు. సాధారణంగా దొంగ స్వామిజీలు మహిళలకు మాయమాటలు చెప్పి తమ తమ ఆశ్రమాల్లో లైంగిక దోపిడీ చేస్తుంటారని చాలా సందర్భాల్లో విన్నాం. తాజాగా అలాంటి ఓ కథనే వినిపిస్తూ పని పాటా లేనివాళ్లకు తనదైన స్టైల్‌లో క్లాస్ పీకారు పూరి. ''కౌశల దేశంలో ఒక ఊరి చివర అడవిలో ఒక స్వామీజీ ఉండేవారు. ఆయన మహా జ్ఞాని. ఆయన గొప్పతనానికి ముగ్దులై ఊరిలోని అందరూ ఆయనకి ఆశ్రమం కట్టారు. ఆయన ఒక్కరే అక్కడ ఉండేవారు. అప్పుడప్పుడు అందరూ వచ్చి ఆయన చెప్పేది విని వెళ్లిపోయేవారు. ఆయనకి రోజూ ఉదయం ఒక్క అరటిపండు మాత్రమే తినే అలవాటు ఉండేది. ఆ అరటిపండు దేవుడి దగ్గర పెట్టి పూజ అవ్వగానే బట్టలు మార్చుకుని వచ్చేసరికి ఆ ఒక్క అరటిపండుని ఒక ఎలుక తినేసింది. స్వామీజీ వారికి కోపం వచ్చింది. ఒకరోజు ఆయనకు సహనం నశించి ఆ ఎలుకను ఎలాగైనా చంపుదామని ఒక పిల్లిని పెంచుదాం అనే ఆలోచనకు వచ్చారు. Also Read: స్వామీజీవారి కోరిక మేరకు ఊరిలోని వారు ఒక పిల్లిని అక్కడ వదిలేశారు. మరి పిల్లికి పాలు ఎలా? స్వామీజీవారికి ఒక ఆవు ఉంటే మంచిది అనే మరో ఆలోచన వచ్చింది. వెంటనే ఊరివారు ఆవును కూడా తీసుకొచ్చి అక్కడ కట్టేశారు. అలాగే ఆ ఆవును చూసుకోవడానికి బాబ్జీ అనే కుర్రాడిని కూడా పెట్టారు. కానీ ఆ ఎలుక మాత్రం దొరకడం లేదు. ఇంతలో ఓ రోజు ఆవును చూసుకునే బాబ్జీకి జ్వరం రావడంతో ఆ ఆవును చూసుకొని పేడ ఎత్తడానికి బాబ్జీ వాళ్ల అక్కని ఆశ్రమానికి పంపించారు. ఆమె పేరు మోహిని. చక్కని పిల్ల.. పైగా వయసులో ఉంది. ఒక వర్షం కురిసిన పగలు ఆవును కట్టేసి, తడిసిన పైట పిండుకుంటోంది మోహిని. ఆ దృశ్యాన్ని స్వామీజీ చూశారు. మనసు చలించింది. మెల్లగా మోహినిని లోపలకు లాగారు. మ్యూజిక్‌ మొదలైంది. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు వాళ్ల తమ్ముడికి జ్వరం వచ్చినా రాకపోయినా.. మోహిని మాత్రం ఆశ్రమానికి వస్తూ పోతూ రహస్యంగా స్వామీజీ వారికి సేవలు చేసుకునేది. ఇంతలో ఒకరోజు ఆ అమ్మాయి నెలతప్పడంతో ఊళ్ళో అందరికీ ఈ సేవల గురించి తెలిసిపోయింది. కోపంతో మోహిని తండ్రి వచ్చి స్వామీజీని ఆశ్రమంలో నుంచి బయటికి లాగాడు. అందరూ వచ్చి పెద్ద గొడవ చేసి ఆ పిల్లను స్వామీజీకిచ్చి అదే రాత్రి పెళ్లి చేసేశారు. శోభనం రాత్రి బాజ్జీ గాడు ఆశ్రమం బోర్డ్ పీకేశాడు. Also Read: నాలుగు రోజుల తర్వాత మోహిని, వాళ్ల అమ్మ, నాన్న, తమ్ముడు బాజ్జీ ఆశ్రమానికి షిఫ్ట్ అయిపోయి అందరూ అక్కడే ఉంటూ పక్కనే ఉన్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ స్వామీజీని పెద్దకాపుని చేసేశారు. ఆ తర్వాత మోహిని కడుపున పండంటి కొడుకు పుడితే వాడికి వీరినాయుడు అని పేరు పెట్టారు. అలా స్వామీజీ కూడా మనలాగే సంసారంలో పడి సంక**పోయాడు. ఇది కథ. ఇందులో మోరల్ ఏంటంటే.. ఏ కష్టం లేకుండా ఖాళీగా ఉన్నప్పుడే మన ఇగో లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే కోపాలు వచ్చేస్తాయ్‌. అలాంటప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే మన కొంపలు ముంచుతాయి. అసలు ఎలుక అరటిపండు తింటే తప్పేముంది. అది కూడా ప్రాణే కదా.. ఒకటి అరటిపండు కాకపోతే రెండు పెట్టు పూజలో. ఇద్దరూ చెరొకటి తింటే అయిపోతుంది. అనవసరపు కోపం వల్ల తెలియకుండా మన ట్రైయిన్‌ వేరే పట్టాలు ఎక్కేస్తుంది. చాలా దూరం వెళ్లాక కానీ తెలియదు.. ఎటు వెళ్దాం అనుకున్నాం ఎటు పోయాం అనేది. ఈ కథ ఎవరికోసమంటే పని పాటా లేకుండా ఉన్నవారికి లేదా జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉన్నవాళ్లకి'' అంటూ ఆసక్తికర కథ వినిపించారు పూరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cSw5F9

No comments:

Post a Comment

'We Lost So Many Things In This War'

'The war ended in 2009 and I believe the new generation of Tamils don't know what was going on there.' from rediff Top Intervi...