వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో రాజకీయ, శృంగార నేపథ్యంలో సినిమాలు రూపొందించి జనం నోళ్ళలో నానుతున్నారు. ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఏదో ఒక డిఫరెంట్ మూవీ అనౌన్స్ చేస్తూ అందరి దృష్టి తన సినిమాలపైనే పడేట్టు చేసుకుంటున్న ఆయన.. ఆయా సినిమాలపై వ్యతిరేకత వచ్చినా, వివాదాలు చుట్టుముట్టినా అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఇటీవలే 'పవర్ స్టార్' సినిమాతో పీకే ఫ్యాన్స్‌ని కెలికిన వర్మ.. ఇప్పుడు '' రూపంలో ఏకంగా మెగా ఫ్యామిలీకే సూటి పెట్టేశాడు. అంతేకాదు మాజీ సీఎం కుమారుడిని కూడా వదిపెట్టలేదు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఫిక్షనల్ రియాలిటీ(FR) అనే జోనర్‌లో సినిమా అంటూ 'ఆర్జీవీ మిస్సింగ్' సినిమా ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్న ఆయన.. ఇది తాను మిస్సైన ఘటనకు సంబంధించిన సినిమా అని తెలిపారు. ఈ మిస్సింగ్‌లో పవర్ ఫుల్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, పప్పు అని పిలవబడే ఆయన కుమారుడు అనుమానితులు అని పేర్కొన్నాడు. Also Read: ఇకపోతే పోస్టర్‌లో రామ్ గోపాల్ వర్మ చేతికి బేడీలు కనిపిస్తుండటం సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇన్నోసెంట్ ఫేస్‌తో కనిపిస్తున్న ఆర్జీవీ 'అమాయకమైన బాధితుడు' అని ప్రకటించుకోవడం విశేషం. అంతేగాక ఆర్జీవీ కిడ్నాప్ అంటూ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తున్నట్టుగా ఈ పోస్టర్ వదిలిన వర్మ.. అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు సెకండ్ లుక్ పోస్టర్‌తో పీకేను పరిచయం చేస్తానని ప్రకటించి తనదైన స్టైల్‌లో మెగా అభిమానుల్లో ఆతృతను పెంచేశాడు. రామ్ గోపాల్ వర్మ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చటర్జీ నిర్మిస్తుండగా అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సో.. సినిమా విడుదలైతే గానే చెప్పలేం ఆర్జీవీ కిడ్నాప్, అందులో మెగా ఫ్యామిలీతో పాటు మాజీ ముఖ్యమంత్రి ఆయన కుమారుడి హస్తం ఎంతవరకు ఉందనేది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33qOhT2
No comments:
Post a Comment