నాటితరం నుంచి నేటితరం వరకు అంటే తెలియని వారు ఉండనే ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకానొక సమయంలో వెండితెరపై తన అందాలన్నీ ఆరోబోసి రసిక ప్రియులను మత్తెక్కించింది సిల్క్ స్మిత. ఎన్నో బోల్డ్ పాత్రల్లో నటించి ఆ రోజుల్లోనే డేరింగ్ గర్ల్ అనిపించుకున్న ఆమె జీవితం నడి వయస్సులోనే అర్దాంతరంగా ముగిసింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో 200లకు పైగా చిత్రాల్లో నటించి తన నిషా కళ్ళతో రొమాంటిక్ ప్రియుల్లో వేడి పుట్టించిన ఈ బ్యూటీ.. 1996లో తనువు చాలించింది. ఆమె మరణం నేటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. సిల్క్ స్మితను హత్య చేశారా? లేక ఆమెనే ఆత్మహత్య చేసుకుందా? అనే దానిపై క్లారిటీ రాలేదు. దీంతో ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీ అయింది. ఈ క్రమంలో సిల్క్ స్మిత జీవితంపై సినిమా తీస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు తమిళ దర్శకుడు కేఎస్ మణికందన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సిల్క్ స్మిత లోని ఆ హాట్‌నెస్ మ్యాచ్ చేసే వాళ్లు పుట్టలేదని అన్నారు. అయితే ఈ బయోపిక్‌లో ఆమె పాత్రను పోషించడానికి, న్యాయం చేయడానికి సరితూగే నటి కోసం వెతుకుతున్నామని అన్నారు. Also Read: ఈ సినిమా కోసం 'అవల్ అప్పడితన్' అనే టైటిల్ ఎంచుకున్నారట డైరెక్టర్ కేఎస్ మణికందన్. ఇందులో సిల్క్ స్మిత డెత్ మిస్టరీపై స్పెషల్ ఫోకస్ పెట్టి.. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించాలని భావిస్తున్నారట. అతిత్వరలో ఈ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు ప్రకటించనున్నారు. ఇప్పటికే సిల్క్ స్మిత జీవితం ఆధారంగా 'డర్టీ పిక్చర్' మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో పాటు ఇందులో టైటిల్ రోల్ పోషించిన విద్యా బాలన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో మళ్లీ ఇప్పుడు అనౌన్స్ కావడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30sczu0
No comments:
Post a Comment