Thursday, 2 April 2020

RRRలో మరో సూపర్ స్టార్... త్వరలో రాజమౌళి ప్రకటన

ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న అతి పెద్ద ప్రాజెక్టు RRR. దర్శకధీరుడు డైరెక్షన్‌లో వస్తున్న మూవీ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక విశేషాలు అభిమానుల ముందుకు వచ్చాయి. తాజాగా RRR నుంచి మరో బిగ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమాలో మరో సూపర్ స్టార్ కూడా నటించనున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ సినిమాలో మళయాళం సూపర్ స్టార్ కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే కన్ఫర్మ్ చేశారు. అయితే దీనిపై మూవీ టీం నుంచి మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రముఖ తారలంతా నటిస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.దీనిక తోడు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా RRRలో మెరవనుంది. కొమురం భీమ్ రోల్ ఎన్టీఆర్ పోషిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఉగాది రోజున టైటిల్, మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తారక్ నీరు, చరణ్ నిప్పుగా.. వీరిద్దరు చేతులు కలిపే సీన్ ని ఆసక్తిగా చూపించారు. సినిమా టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. రౌద్రం రణం రధిరం‌ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ ఏడాది యేడాది జులై 30న రావాల్సిన ఆర్ ఆర్ ఆర్ వచ్చే యేడాది జనవరి 8కి వాయిదాపడిన సంగతి తెలిసిందే. మోషన్ పోస్టర్‌ ఇటీవలే విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసింది. తారక్, చరణ్ అభిమానులకు ఉగాది పండగ తీసుకొచ్చింది. టీజర్ ఓ రేంజ్‌లో ప్లాన్ చేసాడు దర్శకుడు రాజమౌళి . దానికి తోడు కీరవాణి మ్యూజిక్ మరోసారి సినిమాకు హైలైట్ కానుంది. బాలీవుడ్ కాదు హాలీవుడ్ సినిమాల రేంజ్‌లో దీనికి ఆర్ఆర్ ఇచ్చాడు కీరవాణి. RRR ఇండియా 1920 అని కూడా పోస్టర్‌లో పెట్టాడు రాజమౌళి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aEWaFy

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....