Wednesday, 1 April 2020

బయోపిక్‌లో అక్కినేని కోడలు... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత

‘ఏం మాయచేశావే’ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయని ముద్దుగుమ్మ సమంత. తెలుగులో అగ్రహీరోలందరితోను కలిసి నటించించి. మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలతో జతకట్టి హిట్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో ప్రస్తుతం అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. కెరియర్ మంచి టైంలో ఉన్నప్పుడే హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. అక్కినేని కోడలుగా ఆ ఇంట కాలు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందాలతార సమంత త్వరలో ఓ బయోపిక్ లో కథానాయికగా నటించనుంది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు 'బెంగళూరు నాగరత్నమ్మ' జీవితాన్ని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగరత్నమ్మ పాత్రకు సమంతను ఎంచుకున్నట్టు, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. దేవ‌దాసిగా పుట్టి సంగీత క‌ళాకారిణిగా ఎదిగిన నాగ‌ర‌త్న‌మ్మ జీవిత చ‌ర‌మాంకంలో యోగినిగా మారింది. త‌న సంప‌ద‌నంతా క‌ళ‌ల‌కు, క‌ళాకారుల‌కు ధార‌పోసింది. అయితే ఈ సినిమా కోసం ముందుగా అనుష్క పేరు వినిపించింది. రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి చిత్రాలు స‌హా విడుద‌ల‌కు సిద్ధ‌మైన నిశ్శ‌బ్దం చిత్రంలో కూడా అనుష్క మెయిన్ లీడ్‌గా న‌టించింది. ఈమెను ఓ బ‌యోపిక్‌లో న‌టింప చేయాల‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు అనుకున్నారట. అనుష్కతో సంప్రదింపులు కూడా జరిపారని టాక్ వచ్చింది. మరి ఈ ప్రాజెక్టును అనుష్క రిజక్ట్ చేసిందో లేదో తెలియదు కానీ... మరి ఇప్పుడు అనూహ్యంగా స్వీటి స్థానంలో సమంత పేరు వినిపిస్తోంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ‘జాను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తమిళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘96’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2wUtYzZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....