Monday, 8 November 2021

SamanthaRuth Prabhu: ఆ క్రెడిట్ దక్కించుకున్న తొలి సౌత్ హీరోయిన్ సమంత

స‌మంత అక్కినేని .. ఇప్పుడు త‌న కెరీర్‌పై ఫోక‌స్ పెట్టింది. వ‌రుస సినిమాల‌కు ఓకే చెప్ప‌డ‌మే కాదండోయ్‌. త‌న ఫిట్‌నెస్‌పై జాగ్త‌త్త‌లు తీసుకుంటూ వ‌ర్క‌వుట్స్ చేస్తుంది. దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వ‌డానికి స‌మంత రెడీ అయ్యిందంటూ టాక్ వినిపించింది. దీనికి తోడు ఇప్ప‌డు స‌మంత‌కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింద‌ట‌. ఇంతకీ ఏంటో అది తెలుసా?..న‌వంబ‌ర్ 20 నుంచి 28వ వ‌ర‌కు గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) ఈవెంట్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఈ వేడుక‌కు హోస్ట్‌గా స‌మంతకు అవ‌కాశం ద‌క్కింది. ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేయ‌నున్న తొలి అతిథిగా స‌మంత క్రెడిట్ ద‌క్కించుకుంద‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈమెతో పాటు బాలీవుడ్ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయి కూడా ఈ వేడుక‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌ట‌. అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన త‌ర్వాత వ్య‌క్తిగ‌త జీవితంలో వ‌చ్చే ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన రీతిలో స‌మాధానం చెబుతూనే ప్రొఫెష‌న‌ల్ జీవితంలో వ‌రుస అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది స‌మంత‌. ఈమె అనౌన్స్‌ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్ల‌డానికి స‌మ‌యం ఉంది. అయితే ఈ స‌మ‌యాన్ని స‌మంత స‌ద్వినియోగం చేసుకుంటోంది. ఫిట్‌నెస్ విష‌యంపై మ‌రింత శ్ర‌ద్ధ పెట్టింది. మ‌రో వైపు త‌న స్నేహితుల‌తో క‌లిసి టూర్స్‌కు వెళుతుంది. ఇప్పుడు కూడా సామ్, త‌న స్నేహితులతో క‌లిసి డెహ్రాడూన్ టూర్ వెళ్లింది. త‌న క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డితో క‌లిసి ఈ టూర్‌లో ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించిన ఫొటోల‌ను స‌మంత షేర్ చేస్తూ వ‌చ్చింది. సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత రెండు సినిమాల‌ను డెబ్యూ డైరెక్ట‌ర్స్‌తో చేయ‌బోత‌న్న‌ట్లు ప్ర‌క‌టించింది. అందులో ఓ సినిమాను డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ‌పై ఎస్‌.ఆర్‌. ప్ర‌భు, ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ నిర్మిస్తుంటే.. మ‌రో సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు త్వ‌ర‌లోనే స‌మంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YsU6jc

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....