అందరూ దీపావళి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. అయితే హీరో రాజశేఖర్ ఇంట మాత్రం విషాదం నెలకుంది. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ (93) గురువారం సాయంత్రం సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరదరాజన్ గోపాల్ చెన్పై డీసీపీగా రిటైర్ అయ్యారు. ఆయనకు అయిదగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. హీరో రాజశేఖర్, వరదరాజన్ గోపాల్‌కు రెండో సంతానం. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ భౌతికకాయాన్ని ఫ్లైట్‌లో చెన్నైకు తీసుకెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలను నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. హీరో రాజశేఖర్ ఇప్పుడు శేఖర్ అనే సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఆ సినిమాను షూటింగ్‌ను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. మలయాళ చిత్రం జోసెఫ్‌కు ఇది రీమేక్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mK8MUj
No comments:
Post a Comment