Wednesday, 3 November 2021

‘భీమ్లా నాయక్‌’పై మరో అప్డేట్.. సెలెబ్రేషన్స్ ఇంకా అయిపోలేదన్న నిర్మాత

పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి కాసేపటి క్రితం విడులైన ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక మాస్‌కు ట్రీట్ ఇచ్చేలా ఉన్న ఆ ప్రోమోలో డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ఫుల్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి. రోడ్డు మీద కూర్చోవడం, మందు బాటిల్‌తో రెడీగా ఉండటం, కారును పేల్చేయడం, దీపావళి నీకు ముందుగానే వచ్చింది అంటూ డైలాగ్స్ కొట్టడం ఇలా అన్ని కూడా అదిరిపోయాయి. మొత్తానికి భీమ్లా పాటకు సంబంధించిన ఈప్రోమో దుమ్ములేపుతోంది. అయితే దీపావళి కంటే ముందే ఇలా మంచి అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపింది చిత్రయూనిట్. ఇక తాజాగా మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. లా లాలా భీమ్లా పాట ప్రోమో మాత్రమే నేడు విడుదలైంది. ప్రోమోకే సోషల్ మీడియాలో ఊగిపోతోంది. అయితే పూర్తి పాట మాత్రం నవంబర్ 7న రాబోతోంది. అందుకే దీపావళి రోజున ఏదైనా మంచి సర్ ప్రైజ్ ఇవ్వాలని మేకర్లు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రేపు భీమ్లా నాయక్ నుంచి అదిరిపోయే పోస్టర్ రాబోతోందట. ఈ విషయాన్ని చెబుతూ నిర్మాత నాగవంశీ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. దీపావళి సెలెబ్రేషన్స్ ఇంకా అయిపోలేదు.. రేపు క్రాకర్స్ వంటి పోస్టర్ ఉదయం పది గంటలకు రాబోతోందని ప్రకటించారు. మరి ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉంటాడా? లేదా కూడా ఉంటాడా? అన్నది చూడాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనుంది. జనవరి 11న ఈ మూవీ రాబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wbFMrV

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....