Sunday 12 September 2021

RGV: అర్ధనగ్నంగా హాట్ బ్యూటీ.. వర్మ మామూలోడు కాదండోయ్! అషుతో నైట్ పార్టీ అంటూ మరో రచ్చ..

సాధారణంగానే సంచలనాలకు మారు పేరుగా ఉండే .. ఈ మధ్య కాలంలో బోల్డ్ మాటలతో పిచ్చెక్కిస్తున్నారు. సమాజంలోని ప్రతి అంశంపై తనదైన స్టైల్ రియాక్షన్ ఇచ్చే ఆయన అమ్మాయిల అందచందాలపై చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. అమ్మాయి ముందుంటే చాలు మనసులో ఏదీ దాచుకోకుండా ఆమె ముందే అన్నీ కక్కేయడం ఆర్జీవీ నైజం. ఎవరెన్ని మాట్లాడినా, ఎలా కామెంట్ చేసినా తన దారి తనదే అంటూ ముందుకెళ్లే ఆయన, బిగ్ బాస్ భామలు అరియానా, అషు రెడ్డిలతో చేసిన బోల్డ్ ఇంటర్వూస్ జనాల్లో హాట్ ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాను ఎలా వాడాలో సరిగ్గా తెలుసుకున్న వర్మ.. అదే సోషల్ మీడియాను పైసా ఖర్చు లేకుండా తన ప్రమోషన్ ప్లాట్‌ఫామ్‌గా మలచుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ డిఫరెంట్ జానర్స్ టచ్ చేసిన ఆయన, వెబ్ సిరీసులు, బోల్డ్ ఇంటర్వ్యూల్లో కూడా విలక్షణత చాటుతూ సిచుయేషన్ క్యాష్ చేసుకుంటున్నారు. మరోవైపు తన వ్యవహార శైలితో హీరోయిన్లతో ఎంజాయ్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వర్మ షేర్ చేసిన ఓ బోల్డ్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఓ హీరోయిన్ ప్రైవేటు ఫోటోను షేర్ చేసి మరోసారి హాట్ టాపిక్ చేసేశారు. తన ‘డేంజరస్' బ్యూటీ నైనా గంగూలీని ప్యాంట్ లేకుండా నెటిజన్ల ముందు పెట్టేశారు వర్మ. ఇదే అసలైన భంగిమ అంటూ తనలోని రొమాంటిక్ సెన్స్ యాడ్ చేస్తూ ఈ ఫోటోకి క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పిక్ నెట్టింట రచ్చ క్రియేట్ చేస్తోంది. ఇకపోతే ఇటీవలే అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేస్తూ పిచ్చెక్కించిన ఆర్జీవీ.. మై బోల్డ్ హానెస్ట్ బ్యూటీ అంటూ ఆమెకు వెరైటీగా బర్త్ డే విష్ చేశారు. అంతేకాదు ఈ రోజు రాత్రి అషుతో నైట్ పార్టీ కోసం ఎదురుచూస్తున్నా అంటూ హాట్ కామెంట్ వదిలారు. దీంతో అషు- ఆర్జీవీ నైట్ పార్టీ ఎలా ఉంటుందనే దానిపై నెటిజన్ల కన్ను పడింది. చూడాలి మరి నిజంగానే నైట్ పార్టీ చేస్తారా? లేదా అనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Ekwy0a

No comments:

Post a Comment

'Rahul Has To Be More Ruthless'

'I want to ask the Congress only one question: What is more important than election management in politics?' from rediff Top Inter...