మెగా మేనల్లుడు హీరోగా పొలిటికల్ నేపథ్యంలో రూపొందిన సినిమా 'రిపబ్లిక్'. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాను జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై భారీ రేంజ్‌లో భారీ రేంజ్‌లో భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారా? లేక థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తారా అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న థియేటర్స్‌లో ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందులో కలెక్టర్ పంజా అభిరామ్ పాత్రలో కనిపించనున్నారు సాయి తేజ్. రీసెంట్‌గా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ U/A సర్టిఫికెట్ పొందింది. ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో సాయితేజ్ టోపి పెట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపించారు. మరోవైపు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరో సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39gUovd
No comments:
Post a Comment