తెలుగు ప్రేక్షకులకు సినిమాలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరోల సినిమాలు వచ్చాయి అంటే చాలు.. వాళ్లు పొంగిపోతారు. థియేటర్ల వద్ద పటాసులు కాల్చి.. కటౌట్లు పెట్టి.. వాటికి పాలాభిషేకాలు చేసి నానాహంగామా చేస్తారు. అయితే ఇది కోణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిలో నిలిచిపోతాయి. ఆ సినిమా ఏ రోజు ప్రసారం అయినా చూసేందుకు వాళ్లు సిద్ధంగా ఉంటారు. అలాంటి సినిమానే ‘’. స్నేహం, ప్రేమలను ఓ డిఫరెంట్ కాన్సప్ట్‌లో చూపించిన సినిమానే ఇది. టబు, వినిత్, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఏఆర్ రహమాన్ ఈ సినిమాకు అందించిన సంగీతం ఇప్పటివరకూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ముఖ్యంగా ‘ముస్తాఫా.. ముస్తాఫా’.. ‘నను నేనే మరిచినా’ అనే పాటలు ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. అసలు ఓ దశలో ప్రేమ కథలకు ఈ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా ఈ సినిమా నిలిచింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. త్వరలోనే దర్శకుడు కదీర్ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నారట. తాను ఈ సినిమా సీక్వెల్ పనుల్లో ఉన్నట్టుగా కదీర్ స్వయంగా చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. ‘‘ప్రేమదేశం’ వంటి సినిమా మళ్లీ రాలేదని చాలామంది నాతో అంటున్నారు. ఆ సినిమాకి సీక్వెల్ చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ చేద్దామని భావిస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈసారి గతంలోలా కాకుండా తమిళం నుంచి తెలుగులో డబ్బింగ్ చేయకుండా.. నేరుగా తెలుగులోనే ఈ సినిమా తీస్తానని ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు.. చిత్ర నటీనటుల గురించి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hMBdy1
No comments:
Post a Comment