ఆయన సినిమాలు అంటేనే అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. అది ప్రేమ కథ అయినా.. వేరే ఏ జానర్ అయినా.. ఆయన సినిమాలు రూపొందించే స్టైల్ ఇతర దర్శకులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఆయనే సెన్సేషనల్ దర్శకుడు మణిరత్నం. ప్రతి సీన్‌లో, ప్రతి షాట్‌లో ఎంతో అందంగా ప్రేక్షకులను ఎంతో అలరిస్తోంది. అయితే తెరకెక్కస్తున్న లేటెస్ట్ సినిమా ‘’. 1995లో కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవలా ఆధారంగా ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. అదే నవల పేరుతో మణిరత్నం మ్యాజిక్ చేయబోతోన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ మొత్తం కదిలి వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నించింది. ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తి అయిందంటూ.. వచ్చే ఏడాది సమ్మర్‌ని సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో ఓ పవర్‌ఫుల్ ఖడ్గాన్ని మనం చూడొచ్చు. ఈ ప్రకటన రావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సినిమాల పక్క విడుదల తేదీ ఎప్పుడు వస్తుందా అని వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఐశ్వర్య రాయ్‌తో పాటు , జయం రవి, విక్రమ్, కార్తి, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. అస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం దర్శకుడు మణిరత్నంపై పెటా కేసు, నటి త్రిషపై హిందు సంఘాలు ఓ కేసును నమోదు చేశారు. మరి ఈ కేసులను త్వరగా పరిష్కరించుకొని సినిమా విడుదలకు మార్గం సుగమం చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక చిత్ర యూనిట్ త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lwUPas
No comments:
Post a Comment