నందిని రెడ్డి కాంబినేషనల్ వచ్చిన రెండు చిత్రాల్లో ఒకటి అట్టర్ ఫ్లాప్. మరొకటి హిట్. అవి రెండూ కూడా రీమేక్‌లు కావడం మరో విశేషం. జబర్దస్త్, అంటూ నందిని రెడ్డి.. సమంతను కొత్త యాంగిల్‌లో చూపించే ప్రయత్నం చేసింది. ఇందులో సమంతకు ఓ బేబీ చిత్రం కలిసి వచ్చింది. కానీ అదేమీ అంత గొప్ప విజయాన్ని సాధించలేదు. సమంతకు ఉన్న క్రేజ్‌తో అలా గట్టెక్కింది. అయితే ప్రస్తుతం వేడుకలు హైద్రాబాద్‌లో నిర్వహిస్తున్నారు. శని, ఆదివారాల్లో జరుగుతున్న ఈ సైమా వేడుకలకు దక్షిణాది తారలు తరలివచ్చారు. కానీ సమంత మాత్రం గైర్హాజరైంది. శ్రీశైలం, తిరుపతి అంటూ పుణ్యక్షేత్రాలను దర్శించి.. అటుపై చెన్నైకి వెళ్లింది. అందుకే హైద్రాబాద్‌లో జరుగుతున్న సైమా వేడుకలకు హాజరు కాలేకపోయింది. కానీ సమంతకు మాత్రం ఓ బేబీ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డు లభించింది. సమంతకు బదులుగా ఆ అవార్డును తీసుకున్నట్టు తెలుస్తోంది. తనకు ఉత్తమ నటిగా అవార్డు రావడంపై సమంత ఎమోషనల్ అయింది. ఓ బేబీ అనేది నా జీవితంలో మరిచిపోలేని బహుమతి. నాకు అవార్డు ఇచ్చినందుకు సైమాకు థ్యాంక్స్. థాంక్యూ నందినీ రెడ్డి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. అది నీకు తెలుసు. రా మళ్లీ మనిద్దరం కలిసి ఓ మ్యాజికల్ మూవీ చేద్దాం. సైమా అవార్డులు గెలుచుకున్న ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. ఓ బేబీ, ఉత్తమ నటి అంటూ హ్యాష్ ట్యాగ్‌లను సమంత షేర్ చేసింది. ఇక విడాకుల రూమర్లపై మాత్రం సమంత నోరు విప్పడం లేదు. నిన్న తిరుమలలో ఇదే విషయాన్ని మీడియా ప్రస్థావిస్తే.. బుద్ది ఉందా? అంటూ మండిపడింది. సమంత అలా విరుచుకుపడటంతో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3koRHhQ
No comments:
Post a Comment