అక్కినేని హీరోగా రాబోతున్న న్యూ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ''. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. పవన్ సీహెచ్ సంగీతం అందించారు. అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ వైరల్ కావడమే గాక ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో విడుదలకు ముందు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. నేడు (ఆదివారం) రోజు సాయంత్రం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అట్టహాసంగా జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ , బాలీవుడ్ స్టార్ హీరో రాబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ నాగ చైతన్య ఓ ట్వీట్ చేశారు. తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి, అమీర్ ఖాన్ రానుండటం మరింత ఉత్సాహాన్నిస్తోందని పేర్కొన్నారు. చిరంజీవి రాక సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా సమంత- నాగ చైతన్య డివోర్స్ ఇష్యూ హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్‌కి అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున గానీ, సమంత గానీ వస్తారా? లేదా అనేది జనాల్లో చర్చనీయాంశం అయింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hNKjKX
No comments:
Post a Comment