బస్టాప్ సినిమాతో హీరోగా అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత కొన్ని చిత్రాలు చేసినా కూడా అంతగా గుర్తింపు రాలేదు. ప్రిన్స్ హైట్, గ్లామర్‌కు లేడీ ఫాలోయింగ్ బాగానే వచ్చింది. కానీ సినీ కెరీర్ పరంగా సరైన సక్సెస్ మాత్రం రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ప్రిన్స్ తన లక్కును పరీక్షించుకున్నాడు. కానీ ప్రిన్స్‌కు మాత్రం బ్రేక్ రావడం లేదు. ఇక సోషల్ మీడియాలో అయితే ప్రిన్స్ తన కండలను ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఎప్పుడూ ఫిట్ నెస్ గురించి ఆలోచించే ఈ హీరో తాజాగా అందరికీ షాక్ ఇచ్చాడు. ఓ డాక్టర్ అయితే వైద్యం మాత్రమే చేయగలడు.. పోలీస్ అయితే తన డ్యూటీ మాత్రమే చేయగలడు.. కానీ ఓ నటుడు మాత్రం ప్రతీ ఒక్క పాత్రను పోషించగలడు. ఒక్కో సినిమాను బట్టి ఒక్కో పాత్రను పోషిస్తుంటాడు. డాక్టర్, పోలీస్, లాయర్ ఇలా ఎంతో మంది జీవితాల్లోకి ప్రవేశించి నటించగలడు. ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రిన్స్ చెప్పాడు. ఓ నటుడి జీవితం ఎలా ఉంటుందో ఉదాహరణగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఇందులో ప్రిన్స్ ఒంటి మీద బట్టలు లేవు. క్యారెక్టర్ కోసం ఇలా చిత్రయూనిట్.. ప్రిన్స్ బట్టలన్నీ ఊడదీసేసినట్టు కనిపిస్తోంది. అలా కుర్చీ మీద ఎక్కి కూర్చున్నాడు. నేను చేసే ఈ పని నాకెంతో ఇష్టం.. ఎందుకంటే ఎంతో మంది జీవితాల్లోకి వెళ్లి నేను నటించగలను అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రిన్స్ షేర్ చేసిన ఫోటో, పెట్టిన క్యాప్షన్‌కు జనాలు ఫిదా అవుతున్నారు. మొత్తానికి ఈ మూవీకి సంబంధించిన వివరాలు మాత్రం బయటకు చెప్పలేదు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39hYtzp
No comments:
Post a Comment