యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇది వరకు వీరిద్దరూ కలిసి ‘జనతాగ్యారేజ్’ అనే సినిమా చేశారు.ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఐదేళ్ల తర్వాత మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రానుండటంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయ్యింది. త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ 30లో హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోవాలని కొరటాల ప్లాన్ చేసుకుని అందుకు తగినట్లు ఎన్టీఆర్ జోడీని ఎంపిక చేసుకున్నాడట. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఫిక్స్ అయ్యిందని టాక్. ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇప్పటికే ట్రిపుల్ ఆర్‌లో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో నటించింది ఆలియా భట్. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోతో జోడీ కట్టడానికి సిద్ధమైంది ఆలియా భట్. ఈ సినిమాను కొరటాల శివ పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 29న విడుదల చేస్తామని అనౌన్స్‌మెంట్ రోజునే చిత్ర యూనిట్ ప్రకటించడం విశేషం. అంచనాలకు తగ్గట్లుగానే సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆలియా భట్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అనౌన్స్‌మెంట్ రానుందట.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Xy7MZe
No comments:
Post a Comment