‘బాహుబలి’ సినిమా పుణ్యమా అని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కావాలి అంటూ కనీసం మూడు నాలుగేళ్లు పడుతుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే అంత సమయం ఎదురుచూసిన అభిమానులకు ఆ సినిమాతో కావాల్సినంత కిక్ ఇస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు ఆయన ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ‘సలార్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డ్యుయెల్ రోల్‌లో కనిపించనున్నారు. తండ్రిగా మరియు కుమారుడిగా ఆయన నటించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ఆయన చేస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ‘ఆది పురుష్’. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ మహాగాధ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తుండగా.. లంకేశ్వర్ రావణాసురిడా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇక ఇవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులు కాగా.. ఆయన తొలిసారిగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమానే ‘ప్రాజెక్ట్ కే’. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో 10 రోజుల షెడ్యూల్ పూర్తి చేసారు. అయితే నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అవుతున్నట్లు నిర్మాత అశ్వనిదత్ వెల్లడించారు. ఇందుకోసం ప్రభాస్ 200 రోజుల డేట్స్ కూడా కేటాయించారని ఆయన పేర్కొన్నారు. సంవత్సరం లోపే ఈ సినిమా పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్‌లోనే దీపికా కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. విఎఫ్ఎక్స్ పని కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Xwq2D3
No comments:
Post a Comment