గత వారం రోజులుగా అక్కినేని సమంతకు సంబంధించిన ప్రతి కదలిక జనాల్లో చర్చనీయాంశం అవుతోంది. సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న పోస్టులు, సింగిల్‌గా వేస్తున్న టూర్స్ జనాల్లో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పటికే సమంత- నాగ చైతన్య డివోర్స్ ఇష్యూ జనం నోళ్ళలో నానుతుండగా.. తాజా పరిణామాలు ఈ ఇష్యూపై ఉన్న డౌట్స్ రెట్టింపు చేస్తున్నాయి. సమంత గుడి బాట పట్టడం, మీడియాతో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుండటం చూసి లోలోపల ఏదో జరుగుతోందని అంతా ఫిక్సవుతున్నారు. మరోవైపు ఇప్పటికే సమంత- నాగ చైతన్య విడాకుల కోసం అప్లై చేశారని, ఫ్యామిలీ కోర్టులో వీళ్లిద్దరికీ కౌన్సిలింగ్ కూడా పూర్తయిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీక్రెట్‌గా శ్రీ కాళహస్తిలో సమంత శని పూజలు నిర్వహించారని తెలుస్తుండటం హాట్ ఇష్యూగా మారింది. తిరుమల పర్యటనకు ముందే శ్రీ కాళహాస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భగవంతుడిని దర్శించుకున్న సమంత, మళ్ళీ రిటర్న్‌లో శ్రీ కాళహాస్తి చేరుకొని శనీశ్వర స్వామికి పూజలు నిర్వహించారని తెలుస్తోంది. శనివారం ఉదయం శ్రీ కాళహాస్తిలో చండీ హోమం నిర్వహించారట సమంత. ఆ తర్వాత శనీశ్వర స్వామి అభిషేకం జరిపించి అక్కడినుంచి చెన్నైకి బయలుదేరి వెళ్లారని సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోస్ బయటకు రాకపోవడంతో.. సమంత కావాలనే సీక్రెట్‌గా శనీశ్వర స్వామికి పూజలు నిర్వహించారనే టాక్ మొదలైంది. కాకపోతే ఇంత సీక్రెట్‌గా ఈ పూజలు, అభిషేకం జరిపించడం వెనుక కారణాలేంటి అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. కాగా, శ్రీ కాళహస్తిలో నిర్వహించారని తెలిశాక జనం పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. నాగ చైతన్యతో ఏర్పడిన క్లాష్ సద్దుమణగాలని ఈ పూజలు చేయించారని కొందరంటే.. విడాకుల తర్వాత తన జీవితం బాగా ఉండాలని, అంతా మంచి జరుగాలనే ఉద్దేశంతోనే పూజలు చేయించారని ఇంకొందరు చెబుతున్నారు. సో.. చూడాలి మరి ఇకనైనా అక్కినేని ఫ్యామిలీ ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతుందా? లేదా అనేది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Clv0ks
No comments:
Post a Comment